Home Entertainment ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ ఎప్పుడు?… వెల్లడించిన రాజమౌళి

ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ ఎప్పుడు?… వెల్లడించిన రాజమౌళి

114
0

షూటింగ్‌లు నెమ్మదిగా మొదలు అవుతుండడంతో తెలుగు చిత్ర పరిశ్రమ నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ కూడా అక్టోబర్ 15 నుండి థియేటర్లను తెరవడానికి సంసిద్ధతను ప్రకటించింది. తన ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌ను ఎప్పుడు పునః ప్రారంభిస్తాడు అని రాజమౌళి వైపు అందరి దృష్టి ఉంది.

రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన ప్రణాళికను వెల్లడించారు. “మేము అవసరమైన జాగ్రత్తలను అనుసరించి షెడ్యూల్ను రీ షెడ్యూల్ చేసాము. మేము చాలా హోంవర్క్ చేసాము. అతిత్వరలో షూట్ ను తిరిగి ప్రారంభిస్తాము. మేము కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాము” అని ఆయన వెల్లడించారు.

“నటీనటుల వద్దకు వెళ్ళే సిబ్బందికి టెస్టులు చేస్తాం. వారిని ఐసోలేట్ కూడా చేస్తాం. టీం లో ఏ క్యాటగిరీకి చెందినవారు షూటింగ్ స్పాట్ కు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అనే దాని గురించి విస్తృతమైన హోంవర్క్ జరుగుతుంది. కొన్ని చిన్న విషయాలు పెండింగ్‌లో ఉన్నాయి. మేము షూట్‌ను తిరిగి ప్రారంభిస్తాము అతి త్వరలో, “అన్నారాయన.

ఎన్టీఆర్ టీజర్ కూడా తొందరలో వస్తుందని, దానికి సంబంధించిన వర్క్ పక్కాగా పూర్తి అయ్యాకా అది ఎప్పుడు వస్తుంది అనేది ప్రకటిస్తాం అని ఆయన అన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి 2020 కి విడుదల కావాల్సి ఉంది, అయితే ఈ పాండమిక్ విరామం కారణంగా ఈ చిత్రం నిరవధికంగా వాయిదా పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here