Home Entertainment చెక్… నితిన్ కొత్త సినిమా టైటిల్

చెక్… నితిన్ కొత్త సినిమా టైటిల్

252
0

వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రాన్ని చేస్తున్న నితిన్ త్వరలో హిందీ సినిమా అందాధూన్ రీమేక్ చేయనున్నాడు. మరోపక్క చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. దానికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. భవ్య క్రియేషన్స్ నిర్మించే ఈ చిత్రం పేరు చెక్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వరియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రం ప్రీ లుక్ తో పాటు టైటిల్ ని రిలీజ్ చేశాడు. ఇక ఈ ప్రీ లుక్ పోస్టర్ లో చేతికి సంకెళ్లతో నితిన్ కనిపిస్తున్నాడు. అలాగే టైటిల్ కి తగ్గట్టుగా చదరంగం ఆడుతూ నితిన్ కనిపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here