Home Entertainment పెదవి విప్పని హీరోయిన్?

పెదవి విప్పని హీరోయిన్?

214
0

ప్రస్తుతం బాలీవుడ్ నుండి టాలీవుడ్ ని తాకిన డ్రగ్స్ కేసులో సౌత్ హీరోయిన్ రకుల్ అడ్డంగా బుక్కయ్యింది. గత రెండుమూడు రోజులుగా రకుల్ డ్రగ్స్ సేవించిన విషయంలో ఎన్నో రకాల న్యూస్ లు సోషల్ మీడియాని చుట్టేసాయి. బాలీవుడ్ లో రియా ఫోన్ లిస్ట్ దొరికినప్పుడే రియా ఫోన్ లో రకుల్ నెంబర్ దొరికింది అని చెబితే.. రకుల్ డ్రగ్స్ తీసుకుంటుంది అనే విషయం రియా ఎన్ సీబీకి చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత ఎన్ సీబీఐ అధికారులు రకుల్ పేరు లేదని, కాదు ఉంది ఆమెని విచారిస్తాం అని చెప్పకనే చెప్పేసారు. అయితే రకుల్ ఎన్ని జరిగినా మీడియాకి అందుబాటులోకి రావడం లేదు. రియా తో ఫ్రెండ్ షిప్ చేసిన పాపానికి నన్ను కూడా ఇరికించిందని రకుల్ బాధపడుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

అంతేకాకుండా డ్రగ్స్ కేసుతో తనకి సంబంధం లేదని రకుల్ వాదించడం లేదు. రకుల్ ప్రీత్ నోరు విప్పి ఎదో ఒకటి చెప్పాక ఎన్ సీబీ అధికారులు విచారిస్తే ప్రాబ్లెమ్ అవుతుంది అని అనుకుందేమో రకుల్. ప్రస్తుతానికి సోషల్ మీడియాలోనూ రకుల్ స్పందన లేదు. నిన్నటివరకు రకుల్ కి సారి చెప్పి సపోర్ట్ చేసిన నెటిజెన్స్ మళ్ళీ ఈ రోజు రకుల్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డ్రగ్స్ కేసు విషయంలో రకుల్ ప్రీత్ ఏం మాట్లాడకూడదని ముందే ఫిక్స్ అయ్యింది అని… అందుకే రకుల్ ఈ విషయంపై పెదవి విప్పడం లేదని అంటున్నారు. ఈ కేసులో మాట్లాడితే అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోవడం ఖాయమని అందుకే సైలెంట్ గా ఉంటే పోతుంది అంటూ ఆమె సన్నిహితులుఇచ్చిన సలహా మేరకే రకుల్ కామ్ గా ఉందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here