Home gossips అందరి ముందు రష్మి ఓపెన్.. కొన్నేళ్లుగా దాచుకున్న రహస్యాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించిన జబర్దాస్ట్ అందం

అందరి ముందు రష్మి ఓపెన్.. కొన్నేళ్లుగా దాచుకున్న రహస్యాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించిన జబర్దాస్ట్ అందం

154
0

బుల్లితెర క్రేజీ యాంకర్ రష్మీ తన ఏజ్ విషయంలో ఎప్పటినుంచో సీక్రెట్ మెయిన్‌టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సీక్రెట్ బయటపెడుతూ ఓపెన్ అయింది ఈ జబర్దస్త్ బ్యూటీ.

బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు సుపరిచితం యాంకర్ రష్మీ. బుల్లితెరపై జబర్దస్తీ చేస్తూనే అప్పుడప్పుడు వెండితెరపై అందాల విందిస్తూ అట్రాక్ట్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం యాంకరింగ్ తోనే ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న రష్మీ.. వెండితెరపై ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం రాబట్టలేక పోతోంది. అందాల ఆరబోత, శృంగార సన్నివేశాల్లో నటించడం లోనూ వెనక్కి తగ్గకపోయినా ఆమెకు సిల్వర్ స్క్రీన్ అనేది నిరాశ గానే మిగిలిపోయింది. ఆమె నటించిన సినిమాల్లో ఒక్క ‘గుంటూరు టాకీస్’ మినహా మరే సినిమా అంతగా రిజల్ట్ రాబట్టలేదు.

దీంతో కొంతకాలం సిల్వర్ స్క్రీన్ జర్నీని పక్కనబెట్టి ఎక్కువగా బుల్లితెర ప్రోగ్రామ్స్‌కే ప్రాధాన్యత ఇస్తూ అలరిస్తోంది రష్మీ గౌతమ్. ప్రతి పండగ రోజున రష్మీ ప్రోగ్రాం లేనిదే ఆ రోజు గడవదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ యంగ్ లేడీ బ్యాచిలర్ పెళ్లిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ వచ్చిన ఎన్నో ప్రోగ్రామ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక రష్మీ- సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళిద్దరి జోడీకి బుల్లితెరపై యమ క్రేజ్. తమ లవ్ ట్రాక్‌పై వస్తున్న రూమర్స్‌ని ఎన్నిసార్లు ఖండించినా వాటికి మాత్రం బ్రేకులు పడే అవకాశమే కనిపించడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here