Home Entertainment అలా చేస్తే.. జగన్ జనం గుండెల్లో దేవుడే…?

అలా చేస్తే.. జగన్ జనం గుండెల్లో దేవుడే…?

450
0

ఉద్ధానం అంటేనే పక్కన కిడ్నీ సమస్య అని కూడా రాసుకోవాల్సిఉంటుంది. అంతగా జతకలసిన ఈ రెండింటినీ విడదీయడానికి నాటి పాలకులకు ఎక్కడా తీరిక లేకపోయింది. పండు ముసలి నుంచి చిన్నారులు వరకూ ఈ వ్యాధి బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న పెను విషాదమిది. నీళ్ళు తాగి మరణాన్ని కోరి తెచ్చుకున్న దయనీయమైన స్థితి ఎక్కడా లేదు. ఉత్తరాంధ్రాలోని అత్యంత వెనకబడిన శ్రీ కాకుళం జిల్లాలో దూరాన ఉన్న పలాస, ఇచ్చాపురంలలో కిడ్నీ వ్యాధుల సమస్య ఉంది. దాంతో ఇక్కడ జనం తమ ప్రారబ్దం అనుకుంటూనే ఏళ్ళూ పూళ్ళూ గడిపేశారు. తమ సమస్యను ప్రభుత్వాలు తీర్చవని కూడా కచ్చితమైన నిర్ణయానికి వచ్చేశారు.

అలా హైలెట్…..

అయితే ఉద్ధానం సమస్యను రాష్ట్ర స్థాయిలో చర్చగా తీసుకెళ్ళిన ఘనత మాత్రం జనసేనాని పవన్ దే. ఈ సమస్య గురించి అప్పటికే అందరికీ తెలిసినా కూడా ఏమీ చేయని స్థితి నుంచి ఏదో చేయాలి అన్న దానికి పాలకులు వచ్చారంటేనే పవన్ చేసిన కృషి కొంత ఉందని ఒప్పుకోవాలి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉద్ధానానికి ఎంతో చేస్తామని చెప్పారు కానీ ఏదీ చేయలేకపోయారు. దాంతో ఇక్కడ జనాలు వైసీపీ సర్కార్ వైపు చూస్తున్నారు. తమ కష్టాలు జగన్ తీరుస్తారనివారు ఆశాభావంతో ఉన్నారు.

భారీ ప్రాజెక్ట్ ….

ఈ నేపధ్యంలో వారు అనుకున్నట్లుగానే వైసీపీ సర్కార్ అనుకూలంగా స్పందించింది. దాదాపుగా 700 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుడుతోంది. హీరమండలం రిజర్వాయర్ నుంచి భూగర్భ పైపు లైనుల ద్వారా ఉద్ధానానికి మంచినీరు తీసుకువచ్చే పధకానికి జగన్ త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారని సమాచారం. అలా తెచ్చిన నీటిని గ్రామాల్లో రక్షిత మంచి నీటి పధకం ద్వారా ప్రజలకు అందచేస్తారు. దాంతో ప్రజలకు భూగర్భ జలాలను చేదుకుని నీరు తాగే దురవస్థ తప్పుతుంది. దాంతో పాటే విషాన్ని మింగి కిడ్నీ వ్యాధుల బారిన పడి చనిపోవడాలు అసలు ఉండవు. దాదాపు ఆరు లక్షల మంది ప్రజానీకానికి ఉపయోగపడే ఉద్ధానం ప్రాజెక్ట్ కి జగన్ శ్రీకారం చుట్టడం అంటే ఈ ప్రాంతీయులకు అపర భగీరధుడు అనే చెప్పాలి.

 

రికార్డేగా….?

ఉద్ధానం ఈనాటి సమస్య కాదు, అది చిరకాలం నుంచి ఉన్నది. అటువటి సమస్యను కనుక జగన్ పరిష్కరిస్తే మాత్రం ఆయన జనం గుండెల్లో దేవుడే అవుతారు. తమ బతుకులు ఎవరూ మార్చలేరని స్థిర నిర్ణయం తీసుకుని మొద్దుబారిన మనసులతో జీవిస్తున్న వారందరికీ కొత్త దారి చూపిన జగన్ని వారు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటరన్నది నిజం, వాస్తవానికి ఉద్ధానం సమస్య‌ పరిష్కరించాలని వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అనుకున్నారు కానీ ఆయన హఠాత్తుగా చనిపోవడంతో తరువాత ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోలేదు. మళ్లీ ఇన్నాళ్ళకు కొడుకు జగనే పరిష్కారం చూపడానికి ముందుకు రావడం అంటే గొప్ప విషయమే అని చెప్పాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here