Home movie news ఆర్టీఆర్ షూటింగ్ కోసం పూజ చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు

ఆర్టీఆర్ షూటింగ్ కోసం పూజ చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు

185
0

కరోనా లాక్ డౌన్ తో అన్ని షూటింగ్స్ బంద్ అయినట్లుగా రాజమౌళి కూడా RRR ని ఆపేసాడు. కాకపోతే షూటింగ్ ఆగిన కొద్దీ రోజులకి రామ్ చరణ్ పుట్టిన రోజు రావడం రామ్ చరణ్ అల్లూరి టీజర్ తో మెగా అండ్ ని రాజమౌళి శాటిస్ ఫై చెయ్యడం చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఎన్టీఆర్ కొమరం బీమ్ టీజర్ లుక్ కోసం బాగా ఎదురు చూసారు. కానీ కరోనా వలన ఎన్టీఆర్ లుక్ ని వదలలేక చేతులెత్తేశాడు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ కి కోపం వచ్చింది. ఎన్టీఆర్ లుక్ ఎప్పుడు వస్తుందో అంటూ మళ్లీ ఎదురు చూపులు స్టార్ట్ చేసారు. అయితే తాజాగా కేంద్ర అనుమతులతో అక్కడక్కడా షూటింగ్స్ మొదలైనాయి. దానితో టాలీవుడ్ కూడా మొదలు పెడుతుంది అనుకుంటే ఎవ్వరూ కదలడం లేదు.

అయితే తాజాగా రాజమౌళి ఎన్టీఆర్ ఫాన్స్ కి తీపి కబురు చెప్పారు. అదేమంటే RRR షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అప్పటినుండి పది రోజుల కౌంట్ డౌన్ లో ఎన్టీఆర్ కొమరం బీమ్ లుక్ వదులుతామని మాటిచ్చాడు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ స్వామి ఎప్పుడు కరోనా తగ్గుతుంది.. అప్పుడు RRR మొదలవుతుంది. వెంటనే మా ఎన్టీఆర్ కొమరం భీం లుక్ చూసుకోవచ్చు అంటూ ఆశగా ఎదురు చూడడానికి రెడీ అయ్యారు. మరి RRR షూటింగ్ కోసమా ఎన్టీఆర్ ఫాన్స్ అప్పుడే పూజలు కూడా మొదలు పెట్టారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here