Home gossips అన్నీ వారికేనా? మేమేమి చేశాం నేరం?

అన్నీ వారికేనా? మేమేమి చేశాం నేరం?

314
0

ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక తమకు పదవులు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమదే ఆధిపత్యం అని భావించారు. కానీ వైఎస్ జగన్ రూటు మాత్రం వేరేగా ఉంది. జగన్ అధికారంలోకి రావడానికి అనేక కారణాల్లో రెడ్డి సామాజికవర్గం సంయుక్త శ్రమ కూడా ఒకటని చెప్పక తప్పదు. రెడ్డి సామాజికవర్గం నేతలు పార్టీ కోసమే కాకుండా ఆర్థికంగా పార్టీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా వాళ్లే దగ్గరుండి పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపించారు.

జగన్ ముఖ్మమంత్రిగా చూడాలన్నది మాత్రమే వారి కోరిక కాదు. వైసీపీ అధికారంలోకి వస్తే తమకు కూడా పదవులు వస్తాయని నమ్మారు. అందరి శ్రమ ఫలితంగా జగన్ అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోక వచ్చాక రెడ్డి సామాజికవర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. పూర్తిగా బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. ఏ పదవి వచ్చినా బీసీ, ఎస్సీ, మైనారిటీలకు కేటాయిస్తున్నారు. మంత్రి పదవుల్లోనూ రెడ్డి సామాజికవర్గానికి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు.

దీంతో ఇటీవల రెడ్డి సామాజికవర్గంలో దీనిపై చర్చ జరిగిందని చెబుతున్నారు. కొందరు రెడ్డి సామాజికవర్గం నేతలు ఈ విషయాన్ని జగన్ దృష్టిికి కూడా తీసుకెళ్లారు. అయితే తన తీరు ఇంతే అని సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది. రెడ్డి, కాపు సామాజికవర్గం నేతలకు మాత్రం పెద్దగా పదవులు ఇవ్వకపోవడంపై పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. కొందరు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు కూడా ఆ వర్గాలకే ఇవ్వడంపై వైసీపీలోని రెడ్డి సామాజికవర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ నేతలను ముందుంచి జగన్ రాజకీయాలు చేస్తుండటం కూడా వీరికి నచ్చడం లేదు. పార్టీలో కంటే ప్రభుత్వంలోనే రెడ్డి సామాజికవర్గం నేతలు పదవులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచి, సీనియర్ లయినా సామాజికవర్గం కారణంగానే తమకు మంత్రి పదవి దక్కలేదంటున్నారు. ఇలా జగన్ బీసీ నామజపం పార్టీలోని రెడ్డి సామాజికవర్గం నేతలకు నచ్చడం లేదు. కానీ జగన్ మాత్రం పదవులన్నీ బలహీన వర్గాలకే అంటున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదేమో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here