Home News పిల్ల‌ల ప్లానింగ్ ఏంటి? అని అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మంత స‌మాధానం!

పిల్ల‌ల ప్లానింగ్ ఏంటి? అని అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మంత స‌మాధానం!

119
0

పెళ్లీడుకొస్తే..పెళ్లెప్పుడూ పెళ్లెప్పుడూ అనే ప్రశ్న.. పెళ్లయితే పిల్లలెప్పుడూ.. ఏం ప్లాన్ చేయట్లేదా లాంటి క్వశ్చన్స్.. సామాన్యులకే కాదు సెలబ్రిటిలకు ఈ ప్రశ్నలు ఎదురుకాక తప్పదు..వాటికి సమాధానం చెప్పక తప్పదు..అక్కినేని ఫ్యామిలి కోడలు, స్టార్ హీరోయిన్ సమంతాకి ఇదే ప్రశ్న ఎప్పుడూ ఎదురవుతుంది..దానికి సమంత తన స్టైల్లోనే సమాధానం ఇచ్చింది.

నాగచైతన్య ,సమంతా 2017, అక్టోబర్ లో పెళ్లితో ఒక్కటయ్యారు..మరో రెండు నెలలు గడిస్తే మూడో పెళ్లి రోజు కూడా జరుపుకోబోతున్నారు.. పెళ్లైన నాటి నుండి చైతూ, సామ్ ఇద్దరు పిల్లల ప్లానింగ్ గురించి క్వశ్చన్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు..మొదట్లో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కామ్ అయిపోయేవాడు చైతూ..లాభం లేదనుకుని ఒకసారి తొందరలోనే ప్లాన్ చేస్తాం అని సమాధానం ఇచ్చాడు..

సమంతా మాత్రం ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారి ఏదో ఒక సమాధానం చెప్తూ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తూనే ఉంది.సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే సామ్ ని రీసెంట్ గా ఒక అభిమాని ఇదే ప్రశ్న అడిగాడు..పిల్లల సంగతి ఏంటి అని…ఇక లాభం లేదని డేట్ కూడా చెప్పింది సామ్.. “నా బాడి పనితీరు తెలుసుకోవాలని చాలామంది ఇంట్రస్ట్ గా ఉన్నారు.. 2022 లో ఆగస్ట్ 7,మార్నింగ్ 7 గంటలకు నేను బిడ్డను కనాలనుకుంటున్నాను అని సమాధానం ఇచ్చింది..ఇకనైనా ప్రశ్నలవర్షం ఆగుతుందో లేదో చూడాలి..

గతంలో ఇదే ప్రశ్నకి “ నేను బిడ్డను కనాలంటే తనే నా ప్రపంచం అయిపోయి ఉండాలి..అప్పుడే కంటాను అని సమాధానం ఇచ్చిన సామ్..ఈ సారి డేట్ తో సహా చెప్పింది..ఇంతకీ ఆ డేట్ కి ,టైంకి స్పెషాలిటి ఏంటో?? తనే చెప్తుంది లెండి.. వెయిట్ చేద్దాం తొందరెందుకు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here