Home News TV తాప్సీ మరియు కంగనా మధ్య పోరాటం….

తాప్సీ మరియు కంగనా మధ్య పోరాటం….

176
0

బాలీవుడ్ లో తాప్సి, కంగన రనౌత్ ల మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. తాప్సి బి గ్రేడ్ హీరోయిన్ అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలపై తాప్సి స్పందిస్తూ నన్ను నేను ఎ గ్రేడ్ హీరోయిన్ లా పరిగణించుకోలేదు. కానీ కంగనా ఎ గ్రేడ్ హీరోయిన్ ఎలా అయిందో తెలీదంటూ కామెంట్స్ చేసింది.

ఇదే విషయమై కంగన డిజిటల్ టీమ్ కౌంటర్ ఇచ్చింది. ఎ గ్రేడ్ హీరోయిన్‌ అవ్వాలంటే అద్భుతమైన నటన, బలమైన వ్యక్తిత్వం, అన్నింటి కంటే ముఖ్యంగా ఓ సోలో హిట్. క్వీన్ ,తను వెడ్స్ మను రిటర్న్స్ , మణికర్ణిక లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు కాకపోయినా ఓ మామూలు సోలో హిట్ అయినా నిన్ను ఎ-గ్రేడ్ కథానాయికను చేస్తుంది. నీ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.. గో తాప్సీ` అంటూ కంగన డిజిటల్ టీమ్ ట్వీట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here