Home News దేశంలో 13ల‌క్ష‌లు దాటిన కరోనా కేసులు

దేశంలో 13ల‌క్ష‌లు దాటిన కరోనా కేసులు

175
0

దేశంలో రోజు రోజుకు క‌రోనా కేసుల సంఖ్aయ పెరిగిపోతూనే ఉన్నాయి. గ‌త 24గంట‌ల్లో దేశంలో 48,916కొత్త కేసులు రాగా, 757మంది మ‌ర‌ణించారు. దీంతో భార‌త్ లో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 13,36,861కి చేర‌గా… మ‌ర‌ణాల సంఖ్య 31,358కి చేరింది. దేశంలో ప్ర‌స్తుతం 4,56,071యాక్టివ్ కేసులుండ‌గా, 8,49,431మంది క‌రోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ఏపీలోనూ ప్ర‌తిరోజు రికార్డు స్థాయి కేసులు వ‌స్తున్నాయి. వైర‌స్ కట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు ఏమాత్రం స‌రిపోవ‌టం లేదు. దీంతో ఏపీలో ప్ర‌తి జిల్లా, ప‌ట్ట‌ణాల్లో క‌రోనా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఏపీలో ప్ర‌స్తుతం 80,858 కేసులుండ‌గా, 933మంది మ‌ర‌ణించారు.

ఇటు తెలంగాణ‌లోనూ క‌రోనా ఉధృతి ఆగ‌టం లేదు. టెస్టుల సంఖ్య పెంచుతున్నా కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం 52,466కేసులుండ‌గా, 455మంది మ‌ర‌ణించారు. టెస్టుల సంఖ్య మ‌రింత పెంచితే కేసుల సంఖ్య పెరుగుతంద‌న్న అభిప్రాయం ఉంది. తెలంగాణ‌లోని గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌న్న తేడా లేకుండా భారీగా కొత్త కేసులు వ‌స్తూనే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here