Home News కేటీఆర్‌కు బండ్ల పుట్టినరోజు శుభాకాంక్షలు

కేటీఆర్‌కు బండ్ల పుట్టినరోజు శుభాకాంక్షలు

154
0

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ‌, బిజినెస్ ప్ర‌ముఖులంతా కేటీఆర్ కు పోటీలు ప‌డి విష్ చేస్తున్నారు.

కేటీఆర్ కు హారీష్ రావు పుట్టిన రోజు విషేష్ చెప్ప‌గా థ్యాంక్స్ బావ అంటూ కేటీఆర్ రిప్లై ఇవ్వ‌గా ఇప్పుడీ ట్వీట్స్ టీఆర్ఎస్ వ‌ర్గాల్లో వైర‌ల్ అవుతున్నాయి. వ‌రుస‌కు సోద‌రుడు అయిన ఎంపీ సంతోష్ … కేటీఆర్ తో ఉన్న చిన్న నాటి ఫోటోల‌ను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు.

అయితే… ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ లోకి వెళ్లి హాడావిడి చేసిన సినీ నిర్మాత బండ్ల గ‌ణేష్ కేటీఆర్ కు శుభాకాంక్ష‌లు చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. యుద్ధం తెలిసిన యువరాజు మెలకువలతో ముందుకు పోతున్న మహారాజు అన్న శ్రీ కె టి ఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బండ్ల గణేష్ అంటూ ట్వీట్ చేయ‌గా… థ్యాంక్స్ అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here