Home News గాజులు తొడుక్కుని లేను… దమ్ముంటే రండి – వర్మ

గాజులు తొడుక్కుని లేను… దమ్ముంటే రండి – వర్మ

214
0

నిత్యం ఏదో ఒక కాంట్రవర్శీ తో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే వర్మ కరోనా మహమ్మారి ఒకవైపు విజృంభిస్తున్నా సరే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వర్మ ఫోకస్ అంత పవర్ సినిమాపైనే ఉంది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, ట్రైలర్ పై పవన్ ఫ్యాన్స్ కాస్త గట్టిగానే కోపంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా వర్మకు వర్కింగ్స్ కూడా ఇస్తున్నారు. అయితే వర్మ మాత్రం నేను రెడీ అంటూ కాలుదువ్వుతున్నారు.

పవర్ స్టార్ కేవలం ఫిక్షన్ సినిమా మాత్రమే. ఎవర్ని ఉద్దేశించి తెరకెక్కించలేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం తీసింది. అలాగే వార్నింగ్‌లు ఇస్తే భయపడడానికి ఇక్కడ ఎవడూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. నేను ఒక్కడినే ఉన్నా. నా ఆఫీస్ అందరికీ తెలుసు. గూగుల్ మ్యాప్స్‌లో కూడా దొరుకుతుంది. రమ్మనండి ఎవరినైనా చూద్దాం అంటూ కౌంటర్ ఇస్తున్నాడు వర్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here