Home News భారతదేశం నుండి చైనాకు మరొక షాక్

భారతదేశం నుండి చైనాకు మరొక షాక్

116
0

కొంత‌కాలంగా అమెరికాకు చైనాకు ఎమాత్రం పొస‌గ‌టం లేదు. అమెరికా, చైనాలు ఓపెన్ గానే విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లకు దిగుతుండ‌గా…చైనా భార‌త్ ను కూడా రెచ్చ‌గొడుతూ వ‌స్తుంది. ఓవైపు నేపాల్ ను ఎగ‌దొస్తూనే మ‌రోవైపు తాను భార‌త్ పై స‌రిహ‌ద్దు రేఖ వద్ద పెత్త‌నం చేసేందుకు ప్ర‌య‌త్నించింది.
ఆయుధ సంప‌త్తిలో మెరుగ్గా ఉండే చైనా త‌మ‌కు ఎదురులేద‌న్న ఉద్దేశంతో కొంత‌కాలంగా హిందూ మ‌హా స‌ముద్రంలో త‌న‌దే పెత్త‌నం అన్న‌ట్లు విర్ర‌వీగుతూ వ‌చ్చేది. కానీ తాజాగా అమెరికాతో భార‌త్ సంబంధాలు మెరుగైన నేప‌థ్యంలో బంగాళాఖాతంలో అమెరికా, భార‌త్ నౌకా ద‌ళాలు సంయుక్తంగా విన్యాసాలు చేప‌ట్టాయి. పాసెక్స్ పేరిట రెండు రోజుల పాటు ఈ విన్యాసాలు కొన‌సాగనున్నాయి. రెండు దేశాల మ‌ధ్య ప‌రస్ప‌ర స‌హ‌కారం, ఇరు దేశాల నౌక ద‌ళాల మ‌ధ్య సాంకేతిక స‌యోధ్య‌, అవ‌గ‌హ‌న ల‌క్ష్యంగా ఈ విన్యాసాలు కొన‌సాగుతున్నాయి.

గ‌తంలో జ‌ర్మ‌నీ, ఫ్రెంచ్ నేవీ యుద్ధ నౌక‌లు ఈ ప్రాంతంలో భార‌త్ తో క‌లిసి సంయుక్త విన్యాసాలు నిర్వ‌హించ‌గా… చైనా-భార‌త్ మ‌ధ్య యుద్ధం త‌ప్ప‌దా అన్న అనుమానాల స‌మ‌యంలో అమెరికా-భార‌త్ విన్యాసాలు చేస్తుండ‌టం అందులోనూ చైనా ఆధిప‌త్యం ఉన్న ప్రాంతంలో విన్యాసాలు చేయ‌టం ఓర‌కంగా చైనాకు గ‌ట్టి హెచ్చ‌రిక‌గా విదేశీ వ్య‌వ‌హ‌రాల నిపుణ‌లు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here