Home gossips పారితోషికాలు తగ్గించిన కథానాయికలు !

పారితోషికాలు తగ్గించిన కథానాయికలు !

206
0

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను మన కథానాయికలు అక్షరాల పాటిస్తారు. అందుకే కాబోలు డిమాండ్‌, క్రేజ్‌ వున్నప్పుడే పారితోషికం విషయంలో ముక్కుపిండి మరి వసూలు చేస్తారు. ఇక కథానాయకుల సపోర్ట్ కూడా వాళ్లకు వుండటంతో నిర్మాతలు అడిగినంత చెల్లించాల్సిందే. తాజాగా కరోనా సినీ రంగంలో పలు మార్పులు తీసుకురాబోతుంది. పారితోషికాల విషయంలో కోతలు కూడా అందులో ఓ భాగమే.

తాజాగా కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు తమ రెమ్యూనరేషన్స్‌ విషయంలో కాస్త తగ్గారని తెలిసింది. ఇటీవల సినిమాకి 2 కోట్లు వసూలు చేసిన కాజల్‌ అగర్వాల్‌ చిరంజీవి ‘ఆచార్య’కు కోటిన్నర మాత్రమే తీసుకుంటుంది. ఇక ఆఫర్ల కోసం వేచి చూస్తున్న రకుల్‌ కూడా ఇంతకు ముందు అందుకున్న మొత్తంలో సగానికి సగం డిస్కౌంట్‌ ఇస్తున్నానని నిర్మాతలకు ఇండికేషన్‌ ఇచ్చేసింది. ప్రస్తుతం రకుల్‌ నితిన్‌ సరసన ఓ చిత్రంలో మాత్రమే నటిస్తోంది. సో.. పారితోషికంలో మార్పులు వల్ల ఆమెకు ఎన్ని ఆఫర్లు వరిస్తాయో వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here