Home Entertainment జబర్దాస్త్ యాంకర్స్ అనసుయా మరియు రష్మి లాక్ డౌన్ !!

జబర్దాస్త్ యాంకర్స్ అనసుయా మరియు రష్మి లాక్ డౌన్ !!

136
0

అనసూయ కి రష్మీ గౌతమ్ అదిరిపోయే షాక్ ఎప్పుడో ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు లాక్ డౌన్ షాక్ ఏమిటి అనుకుంటున్నారా… గతంలో జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు అనసూయ కొన్ని ఎపిసోడ్స్ కి యాంకర్ గా చేసినప్పుడు ఆ షో క్రేజ్ మాములుగా లేకపోవడంతో.. అనసూయ చెట్టెక్కి భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చెయ్యడంతో మల్లెమాల ప్రొడ్యూసర్స్ అనుసయా కి షాకిచ్చి రష్మీ గౌతమ్ ని జబర్దస్త్ యాంకర్ గా తీసుకొచ్చారు. నాకు తెలియకుండానే రష్మీ జబర్దస్త్ కి వచ్చింది అని అనసూయ చాలాసార్లు వాపోయింది. మల్లి ఏమైందో ఏమో ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ యాంకర్ గాను, అనసూయని మల్లి జబర్దస్త్ ని యాంకర్ గాను తీసుకున్నారు. అప్పటినుండి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకదానిమీద ఒకటి పోటీగా మిగతా టివి ఛానల్స్ ని వణికిస్తున్నాయి.

అయితే తాజాగా మూడు నెలల గ్యాప్ తో బరిలోకి దిగిన కమెడియన్స్ అంతా కరోనా కామెడీతో జబర్దస్త్ స్టేజ్ ని దడదడలాడించారు. రెండు వారాలుగా నూతన ఉత్సాహంతో అటు రష్మీ, ఇటు అనసూయ లు యాంకరింగ్ లో ఒకరిమీద మరొకరు పోటీ పడుతుండగా.. కమెడియన్స్ కూడా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ని ఓ ఊపు ఊపుతున్నారు. అయితే తాజాగా అనసూయ జబర్దస్త్ మీద రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ టీఆర్పీలో దూసుకుపోతుంది. గత రెండు వారాలుగా అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ కంటే రష్మి గౌతమ్ హోస్ట్ చేసే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్‌కే ఎక్కువ టీర్పీలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్. జబర్దస్త్ – ఎక్స్ట్రా జబర్దస్త్గ్రా లు చోడోటానికి ఒకేలా ఉండే షోస్ అయినా… రేటింగ్స్ విషయంలో మాత్రం రష్మిగౌతమ్ ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ చూడటానికే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారనే విషయం స్పష్టం అయింది. మరి లాక్ డౌన్ ముందు అనసూయ రష్మీ కన్నాముందుండేది. కానీ లాక్ డౌన్ తర్వాత రష్మీ ముందు అనసూయ వెల వెల బోవాల్సి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here