Home Special Reports తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్

202
0

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును కోరారు. మరోవైపు ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వొద్దని ప్రభుత్వం కోరింది. అంతకుముందు తెలంగాణ సచివాలయం కూల్చివేతకు శుక్రవారం హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. సోమవారం వరకు సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పాత సచివాలయం భవనాలు శిథిలావస్థలో ఉన్నందున.. వాటిని కూల్చి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐతే సచివాలయం కూల్చివేతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. కూల్చివేత పనులు జులై 7న ప్రారంభమయ్యాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆ పనులు కొనసాగుతున్నాయి.పాత సచివాలయ భవనాన్ని కూల్చేసి అదే స్థానంలో రూ.500 కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణాన్ని చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. వీలైనంత త్వరగా కూల్చివేత ప్రక్రియను పూర్తి చేసి శ్రావణ మాసంలో కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు మొదలయ్యేలా చూడాలని కేసీఆర్ సర్కార్ యోచిస్తోంది. దీనిపై విపక్షాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోకుండా.. ప్రజా ధనాన్ని వృథా చేయడం అవసరమా అని మండిపడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో కూల్చివేత పనులు నిలిచిపోనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here