Home Entertainment రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చేతుల మీదుగా అభయ్ బేతిగంటి “రామన్న యూత్” ఫస్ట్ లుక్ విడుదల

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చేతుల మీదుగా అభయ్ బేతిగంటి “రామన్న యూత్” ఫస్ట్ లుక్ విడుదల

141
0

“జార్జ్ రెడ్డి” చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అభయ్
బేతిగంటి. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “రామన్న
యూత్”. ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు.
ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న రామన్న యూత్ ఫస్ట్ లుక్
ను నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం వారు
మాట్లాడుతూ…”రామన్న యూత్ ఫస్ట్ లుక్ బాగుంది. అభయ్ మంచి ఆర్టిస్ట్.
ఇప్పుడు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఓ కొత్త కాన్సెప్ట్ తో సినిమా
రూపొందిస్తున్నాడు. ఆయనకీ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. అభయ్ కు,
చిత్రబృందానికి బెస్ట్ విశెస్” అన్నారు.

ఒక యువకుడు రాజకీయ నాయకుడిగా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు
తిరిగాయి అనేది రామన్న యూత్ చిత్రంలో ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు.
వినోదంతో పాటు ఆలోచింపజేసే నేటి సామాజిక విషయాలు కథలో ఉండబోతున్నాయి.
రొటీన్ కు భిన్నమైన కొత్త తరహా కథ ఇదని తెలుస్తోంది. ఈ చిత్రంలో యూత్
లీడర్ రాజు పాత్రలో అభయ్ బేతిగంటి నటిస్తున్నారు.  ఈ సినిమా ప్రస్తుతం
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సన్నాహాలు
చేస్తున్నారు.

నటీనటులు : అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి
జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి
విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్,  వేణు
పొలసాని తదితరులు

సాంకేతిక నిపుణులు : కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వంత్ బైరి, సౌండ్ డిజైన్ –
నాగార్జున తాళ్లపల్లి, ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, అభయ్, ఆర్ట్ –
లక్ష్మీ సింధూజ, సంగీతం – కమ్రాన్ , సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్
మజీద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ ఎంఎస్ కే, పీఆర్వో – జీఎస్కే
మీడియా, రచన దర్శకత్వం – అభయ్ బేతిగంటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here