ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ క్రేజ్ అండ్ మార్కెట్ ని సొంతం చేసుకున్న స్టార్ హీరోలలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రథముడు. మరి ప్రభాస్ తో ఇప్పుడు సినిమా చెయ్యాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ అలా కాకుండా తనకి ఒక గుడ్ ఫ్రెండ్ గా “వర్షం” సినిమాకి ముందు నుంచే మొదలయ్యి ఇప్పటికీ కొనసాగుతున్న హీరో గోపీచంద్.
వర్షం సినిమాలో ఈ కాంబో.. ఇద్దరూ సమ ఉజ్జీలుగా కనిపించి ఆకట్టుకున్నారు. మరి ఇప్పుడుకి కూడా ప్రభాస్ తన బెస్ట్ విషెష్ ని గోపీచంద్ సినిమా వస్తుంది అంటే తెలియజేస్తాడు. ఇక ఈ కాంబోలో ఈ టైం లో మళ్ళీ సినిమా పడితే భలే ఉంటుందే అని చాలా మందిలో ఉంది. మరి ఈ విషయంలో అయితే గోపీచంద్ సిద్ధంగానే ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు.
ఒక పాన్ ఇండియా సినిమా అందులోని మల్టీ స్టారర్ చెయ్యాల్సి వస్తే ప్రభాస్ తో చేస్తానని తాను వెల్లడించాడు. గోపీచంద్ ఎంత పొటెన్షియల్ ఉన్న నటుడో అందరికీ తెలుసు. ఇక ఈ కాంబోలో గాని ఈ టైం లో హీరో విలన్స్ గా వచ్చినా పాన్ ఇండియా దగ్గర ఈ ఇద్దరు ఫ్రెండ్ దుమ్ము రేపడం ఖాయం అని చెప్పాలి. మరి ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో కాలమే నిర్ణయించాలి.