Home Entertainment వేసవికాలం వేడిలో రాజమండ్రి రోజ్ మిల్క్ కూల్ ఫస్ట్‌లుక్

వేసవికాలం వేడిలో రాజమండ్రి రోజ్ మిల్క్ కూల్ ఫస్ట్‌లుక్

24
0
జై జాస్తి, అనంతిక, జంటగా వెన్నెల కిషోర్, ప్రవీణ్,  ప్రణీత పట్నాయక్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి  నిర్మాతలు. ఇప్పటి వరకు ఈ చిత్రంలో నటించే నూతన హీరో, హీరోయిన్స్ ప్రచార చిత్రాలను గోప్యంగా వుంచిన చిత్రం బృందం నేడు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ఈ చిత్రం హీరో, హీరోయిన్ లను రివీల్ చేసింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ రోజు సాయంత్రం తన సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. దర్శకుడు నాని చిత్ర విశేషాలను తెలియజేస్తూ  పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికి  కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ  జూన్ 10 నుంచి రెండవ షెడ్యూల్‌ను రాజమ్రండి, వైజాగ్‌లో చిత్రీకరిస్తాం. సెప్టెంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్ డీఓపీ: ముఖేష్.జి, శక్తి అరవింద్,  సాహిత్యం: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి
ప్రొడక్షన్ డిజైనర్: అభిషేక్ రాఘవ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here