Home Entertainment “అంటే సుందరానికి” టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్!

“అంటే సుందరానికి” టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్!

65
0

నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అంటే సుందరానికి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ టీజర్ కి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు ఈ టీజర్ కి 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ టీజర్ లో నాని పాత్ర చాలా ఆసక్తికరం గా ఉంది. నాని తో పాటుగా నజ్రియా పాత్ర సైతం ఆసక్తి గా ఉంది. నరేష్, రోషీని, నదియా, రాహుల్ రామకృష్ణ, హర్ష వర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 10, 2022 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here