Home Entertainment Horror With Terror Movie Trailer Launch

Horror With Terror Movie Trailer Launch

138
0

పీజేఆర్ ఫిలింస్ బ్యానర్ పై ఇందిరా ఆర్ట్ క్రియేషన్స్ టి రాజు సమర్పణలో పి.జనార్దన్రెడ్డి నిర్మాతగా వంశీరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం  ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్  చేతుల మీదుగా ఘనంగా  లాంచ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆదివారం రోజున ఫిలిం ఛాంబర్లో  విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
అనంతరం ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ….. చిన్న సినిమాలైనా క్వాలిటీతో చిత్రాన్ని నిర్మిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు ఈ చిత్రం మంచి క్వాలిటీతో నిర్మాత జనార్దన్ రెడ్డి రూపొందించడం చాలా సంతోషకరం దర్శకుడు వంశీ రాజు నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం. ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు ఈ చిత్రం మంచి విజయం సాధించి నిర్మాత జనార్దన్రెడ్డికి మంచి లాభాలు చేకూర్చాలని మరిన్ని చిత్రాలు నిర్మించాలని అన్నారు

ప్రముఖ నిర్మాత దర్శకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ …..దర్శకుడు వంశీ రాజు ఇందులో విలన్ గా నటించడం దాన్ని కామెడీగా చేయడం  చాలా సంతోషంగా ఉంది హారర్ కధా చిత్రం క్వాలిటీ వెనుకాడకుండా నిర్మాత తీయడం చాలా సంతోషం ఈ చిత్రంలో అందమైన 46 మంది అమ్మాయిలు నటించారు వీరందరికీ మరిన్ని అవకాశాలు రావాలని అన్నారు ఈ చిత్రం మంచి విజయం సాధించి నిర్మాత జనార్దన్ రెడ్డికి మరిన్ని చిత్రాలు తీయాలని అన్నారు
ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ….. వంశీ రాజు మంచి అభిరుచిగల దర్శకుడు హర్రర్ చిత్రం ట్రైలర్ చాలా బాగుంది నిర్మాతకు మంచి లాభాలు వచ్చి మరిన్ని చిత్రాలు తీయాలన్నా రు ఇందులో నటించిన  నటీనటులకు టెక్నీషియన్స్ కు మరిన్ని అవకాశాలు రావాలని ఆయన అన్నారు
దర్శక నిర్మాత సత్య రెడ్డి మాట్లాడుతూ…. నిర్మాత జనార్దన్ రెడ్డి గత 20 సంవత్సరాల నుండి చిత్రపరిశ్రమలో ఉంటున్నాడు ఈ చిత్రం తీయడం జరిగింది ది దర్శకుడు చాలా కష్టపడి హారర్ విత్ చిత్రాన్ని రూపొందించాడు నిర్మాతకు మంచి లాభాలు రావాలని ఆయన అన్నారు ఈ బ్యానర్లో మరిన్ని చిత్రాలు రూపొందించి నటీనటులకు టెక్నీషియన్స్ కు అవకాశాలు ఇవ్వాలని అన్నారు

సిక్కోలు శ్రీనివాస్ మాట్లాడుతూ ……నిర్మాత జనార్దన్ రెడ్డి  క్వాలిటీతో హర్రర్ విత్  టెర్రర్ చిత్రం నిర్మించడం చాలా సంతోషకరం అని ఈ చిత్రంలో నాకు ఒక పాత్ర ఇవ్వడం జరిగిందని ఈ చిత్రంలో నేను నెగిటివ్ రోల్ చేశాను నిర్మాత జనార్దన్ రెడ్డి మరిన్ని చిత్రాలు తీసి కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు
హీరోయిన్ స్వర్ణ మాట్లాడుతూ… ఈ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు జనార్దన్ రెడ్డి రాజులకు నా కృతజ్ఞతలు. హారర్ విత్  టెర్రర్ లో నేను మంచి పాత్ర చేశాను ఈ చిత్రం మంచి విజయం సాధించాలని నిర్మాతకు మంచి లాభాలు రావాలని అన్నారు

చిత్ర నిర్మాత జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ …..మా సొంత బ్యానర్ లో గత కొంత సంవత్సరాలుగా పలు చిత్రాలు నిర్మించడం జరిగిందని దర్శకుడు వంశీ రాజు మంచి దర్శకుడు అని భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవుతాడని టాలెంట్ ఉన్న వారిని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మా బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులు ఘన విజయం సాధించేలా చేయాలని ఆయన అన్నారు
చిత్ర దర్శకుడు వంశీ రాజు మాట్లాడుతూ …… హర్రర్ విత్  టెర్రర్ ఈ చిత్రం లాక్డౌన్ సమయంలో కథా చర్చలతో ప్రారంభమై షూటింగ్ ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది నటీనటుల సహకారంతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగిందని చిన్న సినిమా అయినా మంచి క్వాలిటీతో నిర్మించడం జరిగింది ఈ చిత్రంలో నటించిన నటీనటులకు టెక్నీషియన్స్ కు మంచి పేరు వస్తుందని అన్నారు నిర్మాత జనార్దన్ రెడ్డి సహకారంతో చిత్రాన్ని పూర్తి చేయడం జరిగిందని  చిత్రం ఘన విజయం సాధించి నిర్మాత మరిన్ని చిత్రాలు చేయాలని ఆయన అన్నారు
ఈ చిత్రంలో నటీనటులు తదితరులు నటించారు
సాంకేతిక నిపుణులు

బ్యానర్ . పీజేఆర్ ఫిలిమ్స్
సమర్పించు. ఇందిరా ఆర్ట్ క్రియేషన్స్
కెమెరా. సుధాకర్ నాయుడు
సంగీత దర్శకుడు. అర్జున్ ప్రసాద్
రైటర్ ..రంగనాద్
కొరియోగ్రఫీ. ఉమా శంకర్
నిర్మాత. పి జనార్దన్ రెడ్డి
కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం ..వంశీ రాజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here