Home gossips డిజిటల్ ప్రీమియర్ గా “రాధే శ్యామ్”…డేట్ ఫిక్స్!

డిజిటల్ ప్రీమియర్ గా “రాధే శ్యామ్”…డేట్ ఫిక్స్!

197
0

రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన పీరియడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి డివైడ్ టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా, థియేటర్ల లో అంతగా ఆడలేదు అని చెప్పాలి. అయితే ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి సిద్దం అవుతోంది.

ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఏప్రిల్ 1 వ తేదీ నుండి ప్రసారం కానుంది. తాజాగా అందుకు సంబంధించిన ఒక వీడియో ను ప్రైమ్ వీడియో షేర్ చేయడం జరిగింది. తెలుగు లో మాత్రమే కాకుండా, మిగతా బాషల్లో కూడా ఈ చిత్రం ప్రేక్షకులకి అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం ప్రైమ్ వీడియో లో ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here