Home movie news సేవాగుణం చాటుకున్న ఓవ‌ర్సీస్ డిస్ట్రిబూట‌ర్స్..!

సేవాగుణం చాటుకున్న ఓవ‌ర్సీస్ డిస్ట్రిబూట‌ర్స్..!

68
0

బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ ఆసుపత్రిలో జ‌రుగుతున్న సేవా కార్య‌క్ర‌మాల‌కు ఓవ‌ర్సీస్ డిస్ట్ర‌బ్యూట‌ర్స్ అండ‌గా నిలిచారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ గా తెలుగు ప‌రిశ్ర‌మ‌లో చిర ప‌రిచుత‌లైన వెంక‌ట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి గారు రాధాకృష్ణ ఎంట‌ర్ టైన్మెంట్ ఎల్ ఎల్ పి నుండి 14,48,700 రూపాయ‌ల చెక్ ని బాలాకృష్ణ గారికి అంద‌జేసారు.

టాలీమూవీస్ మోహాన్ క‌మ్మ రెండు ల‌క్ష‌లు, కెనెడా తెలుగు మూవీస్ సుమంత్ సుంక‌ర గారు ల‌క్ష రూపాయులు మొత్తం పద్నాలుగు లక్షల నలబై ఎనిమిది వేల ఏడు వందలు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుపత్రికి విరాళంగా అందించారు. బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుపత్రి ఛైర్మ‌న్‌గా బాల‌కృష్ణ అందిస్తున్న సేవాకార్య‌క్ర‌మాలు, అండ‌గా నిలిచిన వీరి సేవాగుణం అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here