Home movie news నా కెరీర్ లో బెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు – శర్వానంద్

నా కెరీర్ లో బెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు – శర్వానంద్

136
0

శర్వానంద్ హీరోగా తిరుమల కిషోర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రం ను మార్చ్ 4 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు నేడు ప్రీ రిలీజ్ వేడుక ను నిర్వహించడం జరిగింది. ఈ వేడుక లో సాయి పల్లవి, కీర్తీ సురేష్ లతో పాటుగా సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న హాజరు అయ్యారు. అంతేకాక ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, లెక్కల మాస్టర్, జీనియస్ సుకుమార్ హాజరు కావడం విశేషం.

ఈ వేడుక లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన పై చూపిస్తున్న ప్రేమ, అభిమానుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సుకుమార్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, తనకు అభిమానిని అని అన్నారు. కీర్తి సురేష్ కి అభిమానిని అని తెలిపిన శర్వానంద్, సాయి పల్లవి పై పొగడ్తల వర్షం కురిపించారు. తనకు మంచి ఫ్రెండ్ అని అన్నారు. ఈ చిత్రానికి ప్రాణం పోసిన దేవి శ్రీ ప్రసాద్ రియల్ రాక్ స్టార్ అని అన్నారు. బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చినందుకు థాంక్స్ అని అన్నారు. కిశోర్ కి సినిమా లో తనతో నటించిన ఖుష్బూ, రాధిక, ఝాన్సీ, ఊర్వశీ, సత్య, రాజశ్రీ, కళ్యాణి తదితరులు తో నటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ థాంక్స్. ఈ సినిమా చేయడానికి కారణం అయిన నిర్మాత సుధాకర్ చెరుకూరి గారికి థాంక్స్. తనను నమ్మి సినిమా చేసా అని అన్నారు. అంతేకాక ఇది తన కెరీర్ లో బెస్ట్ సినిమా గా నిలుస్తుంది, రాసి పెట్టుకొండి అంటూ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here