Home movie news ఆకట్టుకుంటున్న విజయ్ ప్రకాష్ ‘దైవాన్నే అడగాలా’ సాంగ్

ఆకట్టుకుంటున్న విజయ్ ప్రకాష్ ‘దైవాన్నే అడగాలా’ సాంగ్

120
0
సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ పై చిన్ను క్రిష్, గీతిక రతన్ జంటగా, ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా  ‘లవ్ యు రా’. సముద్రాల మంత్రయ్య బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్ సభ్యులు తాజాగా ‘దైవాన్నే అడగాలా’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. 
విజయ్ ప్రకాష్ పాడిన ఈ పాటకు రాజా రత్నం బాట్లూరి లిరిక్స్ అందించారు. ఈశ్వర్ పెరవలి సంగీతం అందించారు. ఆకట్టుకునే ట్యూన్‌తో సాంగ్‌లో చూపించిన నాచురల్ లొకేషన్స్ హైలైట్ అయ్యాయి. ప్రేమించిన అమ్మాయి కోసం పరితపించే అబ్బాయి మనస్తత్వాన్ని ఈ పాటలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. యూత్ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ విడుదలైన కాసేపట్లోనే భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 
ఈ చిత్రం నుంచి అంతకుముందు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేసిన ‘యూత్ అబ్బా మేము’ అనే పాటకు కూడా యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తోంది. విలక్షణ ప్రేమ కథా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో శేఖర్ బండి, సాయినాగ్, మధుప్రియ, దివ్య, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, జబర్దస్త్ చిట్టి బాబు, జబర్దస్త్ కట్టప్ప ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు దర్శకనిర్మాతలు. 
నటీనటులు 
చిన్ను క్రిష్, గీతిక రతన్, శేఖర్ బండి , సాయినాగ్, మధుప్రియ, దివ్య, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, జబర్దస్త్ చిట్టి బాబు, జబర్దస్త్ కట్టప్ప
సాంకేతిక నిపుణులు : 
బ్యానర్ : సముద్రాల సినీ క్రియేషన్స్
కొరియోగ్రాఫర్ : బ్రదర్ ఆనంద్
ఛాయాగ్రహణం : రవి బైపల్లి
మ్యూజిక్ : ఈశ్వర్ పెరవలి
పాటలు  : రాజారత్నం నమ్
సింగర్: విజయ్ ప్రకాష్
మేనేజర్ : సుధాకర్ విశ్వనాధుని
ప్రొడ్యూసర్ : సముద్రాల మంత్ర య్య బాబు
కో ప్రొడ్యూసర్స్ : రవిచంద్ర సురేష్ బోయిన, చంద్రశేఖర రావ్ బండి
డైరెక్టర్ : ప్రసాద్ ఏలూరి
పీఆర్‌ఓ: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here