Home movie news విడుదలకు సిద్దమైన ‘హలో జూన్’

విడుదలకు సిద్దమైన ‘హలో జూన్’

183
0

ఆంట్స్ టు ఎలిపెంట్స్ సినిమాస్ కో  ప్రొడక్షన్ పై  మోజ్విత్ అండ్ చరణ్ తేజ్ సమర్పణలో వస్తున్నమంచి  ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ స్టోరీ  ‘హలో జూన్’.  ప్రస్తుతం అన్ని హంగులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు అనిల్ రెడ్డి.ఎం, జయప్రకాశ్ వి. చిత్రానికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ ..”ఒక మంచి చిత్రాన్ని తెలుగుతో పాటు, తమిళంలో కూడా  విడుదల చేస్తున్నందుకు  మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ఒక ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి జీవితంలో డ్రీమ్స్ ఎలా ఉంటాయో అన్నది ప్రధానంగా సాగుతూ ఆద్యంతం ఆసక్తికరంగా వినోదాన్ని పంచుతూనే  ప్రేక్షకులను బాగా ఆలోచింపజేస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఈ సినిమా ఓ అమ్మాయి జీవితంలో జరిగే టెన్ ఇయర్స్ ఫ్రెండ్ షిప్ అండ్ లవ్ ట్రావెలింగ్. కాలేజీ జీవితంలో ఆ అమ్మాయి ప్రేమలో ఏ  విధంగా మసులుకొంది. ఈ ఒడిదుడుకుల్లో ఆమె ప్రేమ ప్రయాణంలో ఎలాంటి మజిలీలు చోటుచేసుకున్నాయి.. ఆమె ఫ్రెండ్ షిప్ ఎలా సాగింది. ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండులనుంచి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంది అనే సన్నివేశాలు ప్రతిఒక్కరినీ కదిలిస్తాయి.  రాజిష విజయన్  గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి ఇప్పటికే తమిళంలో కర్ణన్, జైభీమ్ చిత్రాలను చేసి మంచి క్రేజ్ ని, నటిగా పేరుని సంపాదించుకుంది. ఈ సినిమాకి ఆమె నటన హైలెట్ గా ఉంటుంది. ఇందులో ఆమె చేసిన ప్రతీ సన్నివేశం సూపర్ గా ఉండడమే కాదు.. అదిరిపోయే రేంజులో ఆమె క్యారెక్టర్ రూపకల్పన జరిగింది.  ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు. రాజిష విజయన్ ప్రస్తుతం మాస్ మహరాజ రవితేజ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.   ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా  విడుదల చేస్తున్నాం.  ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ మా సినిమా అనుకోని చాలా కష్టపడ్డారు.  ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా అన్ని హంగులతో రూపుదిద్దుకుంది. ఇందులో నటించిన వారంతా చక్కటి నటనను కనబరిచారు.  టెక్నీషియన్స్ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఈ సినిమాలో ఎవ్వరూ ఎక్సెప్ట్ చెయ్యని సన్నివేశాలు ఉంటాయి.  ప్రతీ సీన్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది.  యూత్ కు కావాల్సిన అంశాలు అన్ని ఇందులో ఉంటాయి.  ఈ  ‘హలో జూన్’ మ్యూజికల్ గా కూడా బాగా హిట్ అవుతుందన్ననమ్మకం ఉంది. సినిమాలో మొత్తం ఏడు పాటలుంటాయి. సందర్భానుసారంగా వచ్చే ఈ  పాటలు వీక్షకులను విశేషంగా అలరిస్తాయి. ఈ సినిమాని  హీరో సందీప్ కిషన్, దర్శకులు  దేవాకట్టా, అజయ్ భూపతి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు.   ప్రస్తుతం వస్తున్న సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ ‘హలో జూన్’ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకుంది. మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం అన్నారు. ఈ చిత్రానికి కథ: లిబిన్ వర్గీస్, అహ్మద్ కబీర్, లిబిన్ బేబి మాత్యు , డైలాగ్స్ : అనిల్ రెడ్డి.ఎం , పాటలు: శ్రీ సిరాగ్,  ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ : రాజేష్ , డి.ఓ.పి : జితిన్ స్టానిష్ లస్, మ్యూజిక్ : ఇఫ్తీ, ఎడిటర్ : లిజోపౌల్ , ఆర్ట్ : అరుణ్ వింజరాముడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here