Home movie news విజ‌న్ సినిమాస్ ఆఫీసులో ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుక

విజ‌న్ సినిమాస్ ఆఫీసులో ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుక

158
0
ప్రేమ కావాలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది సాయి కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఈ సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ మేల్ యాక్టర్‌గా అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత ఎక్కడ వెనుతిరిగి చూడలేదు. వరుస ఆఫర్స్ పట్టేస్తూ విలక్షణ కథలతో అలరిస్తున్నారు. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను కూడగట్టుకున్న ఈ హీరో మరికొద్ది రోజుల్లో ‘తీస్ మార్ ఖాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ నేపథ్యంలో ‘తీస్ మార్ ఖాన్’ నిర్మాత తమ విజ‌న్ సినిమాస్ ఆఫీసులో ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. పలువురు సన్నిహితుల మధ్య జరిగిన ఈ పార్టీలో ఆది సాయి కుమార్ చేత కేక్ కట్ చేయించి ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పింది ‘తీస్ మార్ ఖాన్’ టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ‘తీస్ మార్ ఖాన్’ దర్శకనిర్మాతలు నాగం తిరుప‌తి రెడ్డి, కళ్యాణ్ జి గోగణ.. ఆది సాయి కుమార్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘తీస్ మార్ ఖాన్’ ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతకు కృతజ్ఞతలు చెప్పిన ఆది సాయి కుమార్.. ముందు ముందు మరిన్ని వినూత్న కథలతో అలరిస్తానని అన్నారు.
ఇక ‘తీస్ మార్ ఖాన్’ సినిమా విషయానికొస్తే.. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లాన్స్ ఆది సాయి కుమార్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది.
రీసెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వీడియోలో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌లో కనిపించి సినిమాపై హైప్ పెంచేశారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
కాస్ట్: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్ , అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : విజన్ సినిమాస్
డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ
ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్ :  తిర్మల్ రెడ్డి యాళ్ళ
మ్యూజిక్ : సాయి కార్తీక్
ఎడిటర్ : మణికాంత్
సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి
పీఆర్.ఒ : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here