హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ 2018లో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఒక్కసారి సంచలనంలా దూసుకొచ్చింది. తొలి సినిమాతోనే తనదైన నటన, అందంతో ఆకట్టుకుందీ ఉన్నది. ఓవైపు నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న పాత్రలో కనిపిస్తూనే మరోవైపు తన అందంతో కుర్రకారును గుండెల్లో గిలిగింతలు పెట్టించిందీ బ్యూటీ. ఈ సినిమా విజయంతో టాలీవుడ్లో ఈ అందాల భామ పేరు ఒక్కసారిగి మార్మోగింది. దీంతో పాయల్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకీ మామ, డిస్కో రాజా వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’ అనే సినిమాతోనూ ఆకట్టుకుందీ బ్యూటీ. ఇదిలా ఉంటే సినిమాలతో నిత్యం బిజీగా గడిపే పాయల్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను ఫిదా చేస్తుంటుందీ బ్యూటీ.
ఈ క్రమంలోనే పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ భామ డెనిమ్ షార్ట్స్ ఫ్లోరల్ ప్రింట్ టాప్‌లో నీలి రంగు డెనిమ్ కోటుతో కవర్ చేయబడిన హాఫ్ బ్లౌస్లో క్లీవేజ్ షో చేస్తూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. పాయల్ పరువాల విందు ఫొటోలు ఇపుడు నెట్టింట సెగలు రేపుతున్నాయి.ఇక కెరీర్ విషయానికొస్తే పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.