ఇదేంది ఇది నీఎక్క‌డా చూడ‌లే.. శ్రుతిహాస‌న్ లేటేస్ట్ ఫోటోల‌పై నెటిజ‌న్స్ కామెంట్స్‌!

  303
  0
  Shruthi Hassan

  కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన బ్యూటీశృతి హాసన్… నటనతో, డ్యాన్స్‌తో, పాటలతో.. తన ప్రతిభను చూపుతూ తండ్రి చాటు కుమార్తె అన్న ట్యాగ్‌ను తొలగించుకొని, ప్రతిభావంతురాలిగా నిలదొక్కుతుంది. ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించిన ఈ ముద్దుగుమ్మ.. బ్రాండింగ్‌తో బిజీ బిజీగా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతూ కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది. తాజాగా శ్రుతి మరోసారి ఇన్ స్టా వేదికగా స్పెషల్ ఫోటోషూట్ ని షేర్ చేసింది.

  అసలే వెస్ట్రన్ లుక్ లో కనిపిస్తున్న ఈ బ్యూటీ టాప్ యాంగిల్ లో అదరగొట్టింది. ఇది కంప్లీట్ లెదర్ వేర్ లుక్. ఒక కంటిని మూసి మరో కంటితో కెమెరాకి ఫోజులిస్తూ అలా మెడలో చైన్ లాగుతూ పిచ్చెక్కించింది. అలా కొంటెగా చైన్ ని పంటితో బలంగా కొరుకుతోంది. అమ్మడు అలా ఫోజివ్వగానే టాప్ నుంచి కెమెరాని క్లిక్ మనిపించారు. బ్లాక్ మకమల్ డ్రెస్ పై కోట్ ధరించింది. కుడి భుజంపై లెదర్ కోటి వేసుకుని ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. శ్రుతి హాసన్ ఫాలోవర్స్ ఈ ఫోజుపై ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.

  అయినా ఇంతగా శ్రుతిమించిన సాహసాలు మంచిది కదు.. తస్మాత్ జాగ్రత్త!! అంటూ ఓ నెటి జన్ కామెంట్ చేయడం విశేషం.. ఇక క్రాక్ సినిమాతో కంబ్యాక్ అయ్యింది మొదలు శ్రుతి స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఓ వైపు సినిమాలు మరోవైపు ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ప్రస్తుతం శ్రుతిహాసన్ హీరోయిన్ గా పాన్ ఇండియా చిత్రం `సలార్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మినహా కొత్త కమింట్ మెంట్లు ఏవీ లేవు.

  `సలార్` షూటింగ్ కే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. షూటింగ్ ఉన్నంత వరకూ ఆన్ ది స్పాట్ అన్నివిధాలా సహకరిస్తోంది. ఆ తర్వాత చెన్నై కి వెళ్లిపోతోందట. ఇక మిగిలిన ఖాళీ సమయంలో మాత్రం ప్రియుడు శంతను హజారికతోనే గడుపుతోంది. ఇటీవలే దీవాళీ పండుగను ప్రియుడితో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.

  Shruthi

   

   

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here