బిగ్‌బాస్‌-5.. మాన‌స్‌, ష‌న్ను, సిరిపై సంచ‌ల‌న‌వ్యాఖ్య‌లు చేసిన విశ్వ‌!

  320
  0
  Bigboss-5

  బిగ్‌బాస్‌-5 సీజ‌న్‌లో తొమ్మిదో వారం విశ్వ ఎలిమినేట్ అయ్యాడు. టాస్కుల్లో వంద శాతం మ‌న‌సు పెట్టి ఆడే విశ్వ బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డం కాసింత ఇత‌ర హౌస్‌మేట్స్‌కు చాలా బాధ‌గా అనిపించింది. ఇక హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విశ్వ ముందు నాగార్జున‌తో క‌లిసి ఇత‌ర హౌస్‌మేట్స్‌తో మాట్లాడాడు. వారి గురించి వివ‌రిస్తూ ఒక్కొక్క‌రికీ ర్యాంకుల‌ను ఇచ్చాడు. ఆ త‌ర్వాత అరియానా గ్లోరితో క‌లిసి స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఒక్కో హౌస్ మేట్ గురించి త‌న అభిప్రాయాన్ని చెప్పుకుంటూ వ‌చ్చాడు.

  ఈ క్ర‌మంలో అరియానా మాన‌స్- ప్రియాంక రిలేష‌న్ గురించి చెప్ప‌మ‌న్న‌ప్పుడు మాన‌స్‌ను ప్రియాంక నిజంగానే ప్రేమిస్తుంద‌ని, త‌నకు చిన్న దెబ్బ త‌గిలినా అక్క‌డ ప్రియాంక ఉంటుంద‌ని, కానీ మాన‌స్ అలా ఆలోచించ‌డం లేదంటూ ఓ ఉదాహ‌ర‌ణ చెప్పాడు. ఓ సంద‌ర్భంలో ప్రియాంక కింద‌ప‌డిపోయిన‌ప్పుడు మాన‌స్ ప‌ట్టించుకోలేదు. ఎందుక‌లా అని నేను అడిగితే గేమ్‌లో అయితే ప‌ట్టించుకుంటాను. ఏదో మ‌జాక్‌లో ప‌డిపోతే నాకు తెలియ‌దని స‌మాధానం చెప్పిన‌ట్లు విశ్వ మాన‌స్ బండారం బ‌య‌ట పెట్టేశాడు.

  ఇక హౌస్‌లో మ‌రో జంట ష‌న్ను – సిరి మ‌ధ్య ఏం న‌డుస్తుందని, ష‌న్నుపై సిరి అలిగేది ష‌న్ను అటెన్ష‌న్ కోస‌మా? లేక ఆడియెన్స్ అటెన్ష‌న్ కోస‌మా? మ‌రో ప్ర‌శ్న వేసింది అరియానా. దీనిపై విశ్వ స్పందిస్తూ.. బ‌య‌ట ఫ్రెండ్ అయినా, ఇక్క‌డ‌కొచ్చిన త‌ర్వాత ఫ్రెండ్ అయినా ఒక‌రి జీవితంతో ఆడుకోకండి.. అనే నేను చెప్పాల‌నుకుంటున్నానంటూ వారిద్ద‌రికీ వార్నింగ్ ఇచ్చాడు. అంటే వీరిద్ద‌రిలో ఎవ‌రు, ఎవ‌రి జీవితాల‌తో ఆడుకుంటున్నార‌నేది తెలియ‌డం లేదు. ఎందుకంటే ఒక‌వైపు ష‌న్ను, మ‌రో వైపు సిరి బ‌య‌ట ప్రేమ‌లో ఉన్నారు. మీ ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల బ‌య‌ట ఉన్న వారి జీవితాలు డిస్ట్ర‌బ్ కావ‌చ్చున‌నేది విశ్వ అభిప్రాయం కావ‌చ్చు.

  ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన విశ్వ‌.. మిగిలిన హౌస్‌మేట్స్‌లో యాంక‌ర్ ర‌వికి నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌ను ఇచ్చాడు. అయితే ర‌వి ఇత‌రుల గురించి మాట్లాడుతాడు. అప్పుడు మ‌నం వినాలి.. కానీ మ‌నం మాట్లాడేట‌ప్పుడు త‌ను విన‌డు. కానీ త‌ను వింటే బావుంటుంద‌ని అన్నాడు. మ‌రోవైపు ష‌న్ను గురించి మాట్లాడుతూ త‌ను గేమ్ గురించి బాగా ఆలోచిస్తున్నాడ‌ని, రెండు ప‌డ‌వ‌ల‌పై కాలు పెట్టి బ్యాలెన్స్ చేయాల‌నుకుంటున్నాడ‌ని, ఆ ప‌ద్ధ‌తి నాకు న‌చ్చ‌ద‌ని చెప్పాడు. ఇక యానీ మాస్ట‌ర్ ఇత‌రుల గేమ్‌పై ఫోక‌స్ పెట్టి త‌నగేమ్‌ను ఆడ‌టం లేద‌ని అన్నాడు. ష‌న్ను, జెస్సీ, సిరిలు గ్రూపుగా ఏర్ప‌డి గేమ్ ఆడుతున్నార‌ని కూడా అన్నాడు విశ్వ‌.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here