తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ నేడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ నెల 11న తన ఆయన చిన్న కుమార్తె మౌనికకు, సికింద్రాబాద్ నివాసి అవినాశ్గౌడ్తో వివాహం జరగనుంది. ఈ పరిణయ మహోత్సవానికి తప్పకుండా రావాలని చిరంజీవిని ఆహ్వానించారు. చిరంజీవికి పెళ్లి పత్రికను అందజేశారు. కాగా, పద్మారావుగౌడ్ నిన్న సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. కుమార్తె పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే బాబీ డైరెక్షన్లో తెరకెక్కించే చిత్రానికి పూజా కార్యక్రమాలు మొదలు పెట్టేశారు చిరంజీవి.