తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ (73) ను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్‌గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని శాంతమ్మ సమాధి వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆ తర్వాత శాంతమ్మ దశ దినకర్మలో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ వెంట మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ అక్టోబర్ 29న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఉంటున్న ఆమెకు గతనెల 29న రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటుతో కుప్పకూలారు.
ఇదిలా ఉంటే టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా, లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్ గారు కూడా మంత్రిని పరామర్శించారు. అనంతరం అక్కడే ఉన్న సీఎం కేసీఆర్‌గారితో ఆయన కొంతసేపు ముచ్చటించారు. చిన్నతనం నుంచే వీరి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.