“వ‌కీల్‌సాబ్ ఫేం” అంజ‌లి లేటేస్ట్ స్ట‌న్నింగ్ లుక్స్ కేక‌..

  301
  0
  Anjali latest

  షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన తెలుగందం అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది. హోమ్లీ పాత్రలతో అందరిని ఆకట్టుకుంటోంది. ఈ అమ్మడు ఆ మధ్య విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలో జరీనా పాత్రలో అద్భుతమైన నటన చూపించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 2013లో సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. కాగా తాజాగా ఈ భామకు చెందిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  అంజలి తన స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ ఫోటోలో అంజ‌లి లోదుస్తుల్లో ఎంతో హాట్‌గా క‌నిపిస్తుంది. ఇక ఆమె ప్ర‌స్తుతం రామ్ చరణ్, శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఆ మధ్య పూజా కార్యక్రమంతో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

  వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ హై బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్‌లో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

  anju

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here