దీపావళి వేడుకును గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు కాజల్ అగర్వాల్ దంపతులు. కాజల్ -గౌతమ్కిచ్లు జంట ఈ దీపావళిని ధూమ్ ధామ్ అనిపించారు.పెళ్లైన తర్వాత వచ్చిన మొదటి దీపావళిని ఎలాగూ మిస్ అయ్యారు. దీంతో ఈ దివాళీని మాత్రం కుటుంబ సభ్యులతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని కాజల్ ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. కాజల్ ఆర్గాన్జా శారీ..స్లీవ్ లెస్ బ్లౌజ్ తో సంప్రదయ వస్త్రాల్లో కనిపిస్తున్నారు.
చందమామ ధరించిన రైన్ స్టోన్ అభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి పండగను రొమాంటిక్ గా జరుపుకోవాలి అనేంతగా ఈ జంట సాటి జంటలకు స్ఫూర్తిని నింపుతుండడం ఆసక్తికరం. కాజల్ చీరలో నిజంగా చందమమాను మించిన అందంతో కనిపిస్తోంది. ఇక గౌతమ్ రెడ్ సిల్క్ కుర్తా ధరించాడు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `ఆచార్య`లో నటించిన సంగతి తెలిసిందే.