ఐటెం భామ‌ల‌ను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎవ‌రో తెలుసా?

  304
  0
  Jd Chakri

  టాలీవుడ్‌లో ఇండ‌స్ట్రీలో ఐటెం సాంగ్స్‌కు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటుంది. చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలకంటే ఐటెం సాంగ్స్ లో నర్తించే భామలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది అని మొన్నామధ్య రాంగోపాల్ వర్మ అన్నాడు. వాళ్ళు స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే ఐటెం సాంగ్స్ లో నర్తిస్తే వాళ్ళకి బోలెడంత గుర్తింపు వస్తుందనేది అతని అభిప్రాయం. అయితే ఇండస్ట్రీకి వచ్చే ప్రతీ నటి ఐటెం సాంగ్స్ కే పరిమితమవ్వాలని అనుకోరు. వాళ్ళు ఎందులో క్లిక్ అయితే అందులో రాణిస్తారు.

  అందులో తప్పేమి లేదు అనేది వాస్తవం. ఇదిలా ఉండగా.. సినిమాల్లో రాణించే హీరోలు అంత ఈజీగా సినీ పరిశ్రమకి చెందిన నటీమణులను పెళ్ళి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు.అలా అని అది లేదు అని కాదు.. ఆ సందర్భాలు చాలా తక్కువ అని అంతే.. ఇది పక్కన పెడితే ఇద్దరు హీరోలు మాత్రం ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన నటీమణులని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళెవరో కాదు..

  ఒకరు శ్రీహరి ఇంకొకరు జె.డి.చక్రవర్తి. శ్రీహరి… నెగిటివ్ రోల్స్ తో పాపులర్ అయిన ఈయన… పలు సినిమాల్లో హీరోగా కూడా నటించి హిట్లు అందుకున్నాడు. అప్పటికే అనేక ఐటెం సాంగ్స్ లో నర్తించి క్రేజ్ సంపాదించుకున్న డిస్కో శాంతిని ఇతను పెళ్ళి చేసుకున్నాడు. వీరి ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి మేఘాంశ్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు.

  శ్రీహరి బాటలోనే జె.డి.చక్రవర్తి కూడా నెగిటివ్ రోల్స్ తో పాపులర్ అయ్యాడు. అయితే తర్వాత హీరోగా కూడా యూత్ ఫుల్ చిత్రాలు చేసి హిట్లు అందుకున్నాడు. అంతేకాదు రాంగోపాల్ వర్మ సినిమాలో వ్యాంప్ పాత్రలు చేసిన అనుకృతని పెళ్ళి చేసుకున్నాడు జె.డి. చక్రవర్తి. ఆమె కూడా పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో నర్తించింది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here