మ‌ళ్లీ నాగచైత‌న్య ద‌గ్గ‌రికి స‌మంత‌.. విష‌యం ఏంటంటే!

  300
  0
  Samchai

  నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ విడాకులు విషయాన్ని ప్రకటించి నెలరోజులు కావస్తోంది. ఈ నెల రోజుల్లో ప్రతీరోజు వీళ్ళ గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఎవరు ఎక్కడ గుమికూడినా చైసామ్ ల డిస్కషన్లే ఎక్కువ. సరే ఇక విడాకులు ప్రకటించాక వీరిద్దరూ ఎవరి కెరీర్ పై వాళ్ళు ఫోకస్ పెట్టారు. కానీ చైతన్యకి ఈ విషయం పై ఎక్కువ ప్రశ్నలు ఎదురుకావడం లేదు కానీ.. సమంతకి మాత్రం ఈ విషయం పై విపరీతమైన ప్రశ్నలు.. నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. వాటి పై రోజుకో విధంగా స్పందిస్తూ వస్తుంది సమంత.

  మరోపక్క వెకేషన్ లలో కూడా ఎంజాయ్ చేస్తోంది. అయితే విడాకుల తర్వాత సామ్ హైదరాబాద్ లో ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆమె ఎక్కడ ఉంటుంది.. అనే ప్రశ్న మొన్నటివరకు చక్కర్లుకొడుతూ వచ్చింది. మొత్తానికి సామ్… చైతు తనకోసం ఎంతో ప్రేమతో తీసుకున్న విల్లాలోనే ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. విడాకుల అనంతరం హైదరాబాద్లో ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసాడు చైతన్య.. అతి త్వరలో అందులోకి షిఫ్ట్ కానున్నాడు.

  అయితే సామ్ మాత్రం చైతూతో గడిపిన అదే విల్లాలో ఉండబోతుందట. సామ్ ఇప్పటికే ఆ ఇంట్లో దిగినట్టు తెలుస్తుంది. తన పెంపుడు కుక్కలతో ఎంజాయ్ చేస్తున్నట్టు సమంత ఫోటోలు బయటకి వచ్చాయి. మరి చైతన్య ఎక్కడ ఉంటున్నట్టు అనే సందేహం మీకు రావచ్చు. కొద్దిరోజులుగా అతను ఓ హోటల్ లో స్టే చేస్తున్నాడట. కొత్తింటి పనులన్నీ పూర్తయ్యాక అందులోకి షిఫ్ట్ అవుతాడు చైతు. ఇక సినిమాల విషయానికి వస్తే చైతన్య నటించిన ‘థాంక్యూ’ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here