నేను క‌ష్ట‌కాలంలో సారా కూడా తాగా: మంచు మోహ‌న్‌బాబు

  331
  0
  Unstoppable

  ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోలో ఫస్టు ఎపిసోడ్ ను మోహన్ బాబుతో చేశారనే విష‌యం తెలిసిందే. ఈ షోకి ఆయనతో పాటు మంచు విష్ణు .. లక్ష్మి కూడా హాజరయ్యారు. దీపావళి కానుకగా నిన్న ఫస్టు ఎపిసోడ్ ను వదిలారు. కాస్త కామెడీగా .. మరికాస్త ఎమోషనల్ గా ఈ ఎపిసోడ్ నడిచింది. మెహన్ బాబు సినిమాల్లో రావడానికి ముందు .. వచ్చిన తరువాత .. మధ్యలో అవకాశాలు తగ్గినప్పటి పరిస్థితి .. నిర్మాతగా విజయాలను .. అపజయాలను అందుకున్నప్పటి పరిస్థితి ..

  ఆ సమయంలో ఆయన పొందిన అనుభవాలు .. ఇవన్నీ కూడా ఈ వేదికపై ఆవిష్కరించబడ్డాయి. అయితే బాలకృష్ణ ప్రశ్నకి సమాధానంగా మోహన్ బాబు తన అభిప్రాయాలను .. అభిరుచులను మాత్రమే కాదు తనకి గల చెడు అలవాట్లను కూడా నిర్మొహమాటంగా చెప్పేశారు. మద్రాసులో కెరియర్ ఆరంభించిన కొత్తలో ‘సారా’ తాగేవాడిని. కోడంబాకం బ్రిడ్జి క్రింద అప్పట్లో సారాయి దుకాణాలు ఎక్కువగా ఉండేవి. ఓ స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్లేవాడిని ..

  సారా తాగేసి వచ్చేవాడిని. కెరియర్ సాఫీగా సాగని రోజుల్లో కూడా సారానే తాగేవాడిని. అప్పుడున్న పరిస్థితి అది .. ఇప్పుడు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు కనుక కాస్త మంచి విస్కీ తాగుతున్నాను” అని చెప్పుకొచ్చారు. గతంలో మోహన్ బాబు చాలా వేదికలపై ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ అప్పుడు చెప్పని చాలా విషయాలను ఆయన ఈ వేదిక ద్వారా పంచుకోవడం విశేషం.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here