కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలిపారు అక్కినేని నాగార్జున. బెంగళూరులోని సదాశివనగర్‌లోగల పునీత్ నివాసానికి ఈరోజు మధ్యాహ్నం చేరుకున్న నాగార్జున పునీత్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందంటూ పునీత్ బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరగా.. వెంటనే వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు.. చికిత్స తీసుకుంటూనే పునీత్ తుదిశ్వాస విడిచారు.. పునీత్ అకాల మరణాన్ని కన్నడిగులు… సినీ ప్రముఖులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
టాలీవుడ్ హీరోలతో పునీత్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. పునీత్ అంత్యక్రియలకు చిరంజీవి, బాలకృష్ణ, తారక్ వకంటి స్టార్స్ హజరయ్యి నివాళులర్పించారు. ఈరోజు నాగార్జున.. బెంగుళూరులోని పునీత్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.. పునీత్ ఫోటోకు నివాళులర్పించి.. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.