సామ్‌ ఇప్ప‌టి నుంచి ఫ్రీగా ప‌నిచేసుకో: వెంక‌టేశ్ డాట‌ర్‌

  291
  0
  sam

  కరోనా వల్ల ప్రభావితం చెందిన వారి జీవితాల్లో ఆశలను రేకెత్తించేందుకు ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నామని సమంత తెలిపింది. దీనిపై సెలెబ్రిటీలంతా కూడా రియాక్ట్ అవుతున్నారు. అందులో భాగంగా వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుబాటి రియాక్ట్ అయింది. ఇక ఫ్రీగా పెయింటింగ్ వేసుకో అని కామెంట్ చేసింది. ఇంత సరదాగా ఉన్నందుకు హ్యాపీగా ఉందని మంచు లక్ష్మీ, ఈ మహారాణిని ఎవ్వరూ ఆపలేరు అంటూ మాళవికా నాయర్ కామెంట్ చేసింది.

  అలా వారు చేసిన కామెంట్లకు సమంత కూడా రిప్లై ఇచ్చింది. రేపు చేస్తాను అంటూ డాక్టర్ మంజుల అనగాని కూడా కామెంట్ చేసింది.ప్ర‌స్తుతం సమంత దుబాయ్‌లో ఉంది. తన ఫ్రెండ్స్ సాధన, ప్రీతమ్‌లతో కలిసి సమంత దుబాయ్‌కి చెక్కేసింది. భారత్ న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లినట్టు కనిపిస్తోంది. మొత్తానికి సమంత మాత్రం ఎక్కడా కూడా ఒక చోట నిలకడగా ఉండకుండా తిరుగుతూనే ఉంది.

  అయితే సమంత తాజాగా పెయింటింగ్ గురించి చెబుతూ ఓ పోస్ట్ చేసింది. అందులోనూ ఓ సూక్తిని చెప్పేసింది. ఒకప్పుడు అలా ఉండేది అంటూ కొన్ని విషయాలు చెప్పింది. మీ మనసు మీదో పెయింటింగ్ వేయలేదు అని చెబితే.. అప్పుడే మనం పెయింట్ వేయాలి.. అలా వెంటనే లోపల అనుకున్న మాటలు ఆగిపోతాయి అని చెప్పేసింది. తాజాగా తాను పెయింటింగ్ వేశాను అని సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికి సమంత వేసిన పెయింటింగ్ మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.

  ఇక స్వేచ్ఛగా ఆ పని చేసుకో సామ్.. సమంతపై వెంకీ కూతురు ఫుల్ సపోర్ట్

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here