కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఈరోజు గుండెపోటుతో మరణించారు. 29 సినిమాల్లో హీరోగా నటించిన ఈ పవర్ స్టార్ వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన గుండెపోటుకు గురైన విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు చేరుకుని పూజలు చేశారు.
ఆయన పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి బయటకు రావాలని అభిమానులు ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరుగా ప్రార్థించారు. అయితే తీవ్రమైన గుండెపోటు రావడంతో పునీత్ రాజ్ కుమార్ ను వైద్యులు కాపాడలేకపోయారు. ఇక ఆయన మరణంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. బెంగుళూరు నగరం సహ కర్ణాటకలో కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. రెండు రోజుల పాటు స్కూల్స్ అలాగే కాలేజీలకు సెలవులు ప్రకటించారు. రెండు రోజులపాటు థియేటర్లను కూడా మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.