ర‌ష్మీగౌత‌మ్‌ను తాకిన ఆక‌తాయిలు.. ఈ విష‌యంలో సెక్యూరిటీ ఫెయిల్‌!

  304
  0
  rashmigautham

  చిత్తూరులోని ఓ షాపింగ్‌మాల్ ప్రారంబోత్స‌వ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన యాంక‌ర్ రష్మీగౌత‌మ్‌ను చూడ్డానికి పెద్ద ఎత్తున జ‌నాలు చేరుకుని హల్‌చ‌ల్ చేశారు. ర‌ష్మీతో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగ‌బ‌డ‌డంతో వారిని అదుపుచేయ‌డం షాపింగ్ మాల్ సిబ్బంది వ‌ల్ల కాలేదు. దీంతో అక్క‌డ తోపులాట జ‌రిగింది. అరుపులు కేక‌ల‌తో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో కొంత‌మంది ఆక‌తాయిలు ర‌ష్మీ మీదికి ఎగ‌బ‌డ్డారు. ఆమెను తాకేందుకు ప్ర‌య‌త్నించారు.

  జ‌నం మ‌ధ్య‌లోనే ఇరుక్కుపోయిన ర‌ష్మీ అస‌హ‌నానికి గురైంది. కానీ అభిమానుల‌కు న‌వ్వుతూనే స‌ర్ధి చెప్ప‌డం జ‌రిగింది. ఇక చేసేది ఏమిలేక జ‌నం తోపులాట మ‌ధ్య నుంచే రిబ్బ‌న్ కూడా క‌ట్ చేయ‌కుండానే షాపింగ్ మాల్‌లోకి అడుగుపెట్టి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఆ త‌ర్వాత షాపింగ్ మాల్ స్టాఫ్‌తో ఫోటోలు దిగారు. షాప్‌లోని చీర‌ల‌ను ప్ర‌ద‌ర్శించారు.

  కాగా.. ఒక సెల‌బ్రిటీ వ‌స్తున్న‌పుడు సెక్యూరిటీ ఏర్పాటుచేయ‌ని షాపింగ్ మాల్ యాజ‌మాన్యం తీరుపై విమ‌ర్శ‌లు వెలువెత్తుతున్నాయి. ఇక ర‌ష్మీ కెరీర్ విష‌యానికి వ‌స్తే.. జ‌బ‌ర్ద‌స్ట్ షో ద్వారా ర‌ష్మీ తెలుగు ప్రేక్ష‌కుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. మ‌రోవైపు సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీబిజీగా మారింది. అలాగే సోష‌ల్ మీడియాలో త‌న అంద‌చందాల‌తో దిగిన ఫోటోల‌ను షేర్ చేస్తుంది ర‌ష్మీగౌత‌మ్‌.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here