త‌మ్ముని త‌ల న‌ర‌క్కాల‌ని వుంద‌ని స్టైల్‌గా పోజిచ్చిన అనుప‌మ‌..

  291
  0
  anupama

  అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు అనుకుంటా.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అఆ చిత్రంలో ఒక ప్ర‌ముఖ పాత్ర‌ను పోషించింది ఈ మ‌ల‌యాళ బ్యూటీ. ఈ బ్యూటీ అందం గురించి ఎంత చెప్పినా త‌క్కువే.. తాజాగా క్యూట్ అందాలు చూపిస్తూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో అనుప‌మ మాములుగా క‌నిపించ‌లే..

  పింక్ డ్రెస్‌లో హోయ‌లు ఒలికిస్తూ పెదాల‌పై చిరున‌వ్వును చిందిస్తూ ఎంతో క్యూట్‌గా క‌నిపించింది ఈ మ‌ల‌యాళ బ్యూటీ. వీటికి సంబంధించిన ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. త‌న‌కు ఎలాంటి స‌మయంలో కోపం వ‌స్తుందంటే.. త‌న‌ను ఫోటో తీయ‌ను అని త‌మ్ముడు చెబితే ఇలాంటి ఫీలింగ్ క‌లుగుతుంద‌ట‌. త‌ల తీసి అవ‌త‌ల పారేయాల‌న్న ఫీలింగ్ క‌లుగుతుంది అని క్యాప్ష‌న్ పెట్టింది. ఇక అనుప‌మ కెరీర్ విష‌యానికి వ‌స్తే..

  అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో వరస సినిమాలు చేస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ సినిమాతో పాటు నిఖిల్‌తోనే కార్తికేయ 2 సినిమాలోనూ నటిస్తుంది. ఇక దిల్ రాజు బ్యానర్‌లో రౌడీ బాయ్స్ సినిమాలోనూ నటిస్తుంది మ‌ల‌యాళ బ్యూటీ. ఈ సినిమాతో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కిస్తున్నాడు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here