ఉప‌రాష్ట్రప‌తి చేతుల మీదుగా ఫాల్కే అవార్డు అందుకున్న ర‌జ‌నీ..

  307
  0
  rajanikanth

  సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. ఎందుకంటే ఆయ‌న ఒక శిఖ‌రం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది అభిమానుల‌ను సంపాదించుకున్న న‌టుడు ర‌జ‌నీకాంత్‌. త‌మిళ్‌తో పాటు తెలుగు, హిందీ ఇలా ప‌లు భాష‌ల్లో చిత్రాల్లో న‌టించి సూప‌ర్‌స్టార్‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ఇండ‌స్ట్రీకి రావ‌డానికి కార‌ణం త‌న ఫ్రెండ్ బ‌స్ డ్రైవ‌ర్ రాజ్‌దూత్ కార‌ణ‌మ‌ని ర‌జ‌నీ ప‌లుమార్లు చెప్పిన విష‌యం తెలిసిందే.

  కాగా తాజాగా సినీ ఇండ‌స్ట్రీలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ర‌జ‌నీకాంత్ సొంతం చేసుకున్నారు. దిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో 67వ‌జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల ప్ర‌ధానోత్స‌వం కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అత్యంత విశిష్ట‌మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు.

  దీనికి సంబంధించిన విష‌యంపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, ర‌జ‌నీకాంత్ అభిమానులు, సినీ ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌జ‌నీకి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు. ఇక ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం త‌మిళ ద‌ర్శ‌కుడు శివ డైరెక్ష‌న్‌లో పెద్ద‌న్న చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో న‌య‌న‌తార‌, కీర్తీసురేశ్‌, మీనా త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తుండ‌గా.. ఈ చిత్రంకు సంబంధించి ఇటీవ‌లే టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను, ఫ్యాన్స్ ఎంతో ఆక‌ట్టుకుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here