జాన్వీకపూర్ అలనాటి అందాల తార శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఎంతో కష్టపడుతుంది. సినిమాలతో పాటు అప్పుడప్పుడూ బయట తన అదిరిపోయే అందాల ఆరబోత చేస్తుంది. తాజాగా మరోసారి పొట్టి పొట్టి డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుంది జాన్వీ. బాలీవుడ్ స్టార్ హీరో మొదటి సారి బుల్లితెరపై సందడి చేస్తున్నారు. హోస్ట్‌గా ది బిగ్ పిక్చర్ అనే షోను చేస్తున్నాడు.
ఇక ఈ షోలో భాగంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు జాన్వీకపూర్, సారా అలీఖాన్ సందడి చేశారు. గ్లామరస్ లుక్‌లో కనువిందు చేయగా.. ఇందులో జాన్వీ కపూర్ పీచ్ కలర్ డ్రెస్‌లో ఎంతో అందంగా ఉంది. మోకాళ్లకి పైకున్న గౌనులో హోయలు ఒలికించింది. థైస్ చూపిస్తూ పొట్టి డ్రెస్‌లో అందాల కనువిందు చేసింది జాన్వీకపూర్ ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో ది బిగ్ పిక్చర్ షోకి గ్లామర్ తీసుకొచ్చారు. ఇక జాన్వీ కెరీర్ విషయానికి వస్తే.. ధడక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి సినీ ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఘోస్ట్ స్టోరీస్, ఆంగ్రేజీ మీడియం, గుంజాన్ సక్సేనా, రూహి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె దోస్తానా-2, గుడ్‌లక్, జెర్రీ, మిలి సినిమాల్లో నటిస్తుంది.