త‌మ‌న్నా ప్లేస్‌లో అన‌సూయ‌.. తీవ్ర అసంతృప్తిలో మిల్క్‌బ్యూటీ!

  204
  0
  thamannha

  మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా భాటియా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. స్టార్ హీరోయిన్‌గా వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకెళ్తుంది. ఓ వైపు క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న త‌మ‌న్నా.. స్పెష‌ల్ సాంగ్స్‌లో, ఇటు డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లోనే కాకుండా బుల్లితెర‌పై కూడా స‌త్తా చాటుతుంది. ఇటీవ‌లే మ్యాస్ట్రో, సీటీమార్ వంటి చిత్రాల‌తో విజ‌యాల‌ను సొంతం చేసుకుంది ఈ అమ్మ‌డు. తాజాగా ఆమె హోస్ట్‌గా ప్రారంభించిన మాస్ట‌ర్ ఛెఫ్ షో నుంచి త‌ప్పుకోవ‌డం తెలిసిందే.. అయితే దీనిపై త‌మ‌న్నా కోర్టును ఆశ్ర‌యించిన‌ట్టు వార్తాలు వెలువ‌డుతున్నాయి.

  వివ‌రాల్లోకి వెళితే.. ఆగ‌ష్టు 21వ తేదీన హోస్ట్‌గా త‌మ‌న్నా మాస్ట‌ర్ చెఫ్ కార్య‌క్ర‌మం ప్రారంభం అయింది.ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకోగా.. ఆ త‌ర్వాత‌ కంటెంట్ సరిగా లేకపోవడంతో రేటింగ్ దారుణంగా పడిపోయింది. కాగా మాస్ట‌ర్ చెఫ్ కార్య‌క్ర‌మం నుంచి త‌మ‌న్నాను త‌ప్పించి టాప్ యాంక‌ర్ అన‌సూయ‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. అయితే అనసూయ రంగ ప్రవేశం‌తో ఈ షో మంచి రేటింగ్ సాధిస్తుందనే ఆశాభావంతో ప్రొడక్షన్ హౌస్ ఉన్నట్టు సమాచారం.

  అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రొడక్షన్ హౌస్‌కు తమన్నా షాకిచ్చింది. తనను తొలగించడంపై తమన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీపై తన లాయర్ చేత నోటీసులు పంపించారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసుల్లో పేర్కొన్నారు అని వెల్లడించింది. దీనిపై త‌న త‌రపున లాయ‌ర్ చెబుతూ.. తనను తొలగించడంపై తమన్నా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీపై తన లాయర్ చేత నోటీసులు పంపించారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసుల్లో పేర్కొన్నారు అని వెల్లడించింది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here