కాంగ్రెస్‌లోకి ఈటెల జంప్‌.. కేటీఆర్ సెన్సెష‌న‌ల్ కామెంట్స్‌!

  229
  0
  ktr vs etela

  తెలంగాణ రాష్ట్రంలో ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఒక పార్టీ గుర్తుతో గెలిచి మ‌రో పార్టీలోకి వెళ్ల‌డం ఈ మ‌ధ్య రాజ‌కీయ నాయ‌కుల్లో స‌ర్వ‌సాధార‌మైపోయింది. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల‌తో రాష్ట్ర రాజ‌కీయాల్లో వేడిని మ‌రింత పెరిగింది. టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నిక‌ల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఈ ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్‌.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశాడు. ఓ తెలుగు ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్యూలో కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

  ఈటెల రాజేంద‌ర్‌కు హుజురాబాద్‌లో డిపాజిట్ కూడా ద‌క్క‌ద‌ని అన్నారు. నిజానికి ఈటెల బీజేపీ అభ్య‌ర్థి కాద‌ని కాంగ్రెస్‌-బీజేపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థి అని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఇటీవ‌లే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, ఈటెల రాజేంద‌ర్ గోల్కొండ రిసార్ట్‌లో ర‌హ‌స్యంగా భేటీ అయ్యార‌ని అన్నారు. ఏడాదిన్న‌ర త‌ర్వాత ఈటెల రాజేంద‌ర్ కాంగ్రెస్‌లో చేరుతార‌ని కేటీఆర్ జోస్యం చెప్పారు.

  చీక‌టి ఒప్పందంతో ఈ రెండు పార్టీలు ప‌నిచేస్తున్నాయ‌ని ఆరోపించారు. ఈ సంద‌ర్భంగానే వైఎస్ ష‌ర్మిల‌, ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ గురించి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చేందుకు ప‌న్నిన జాతీయ పార్టీల ప‌న్నాగంలో వీరు పావుల‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలోనే ష‌ర్మిల హుజురాబాద్‌లో ఎందుకు పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here