ఇండియాలో తొమ్మిది నెలల్లోనే వంద కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేసి ఘనత సాధించింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా.. తొలుత ఆరోగ్య, వైద్య సిబ్బందికి టీకా డోసులు ఇచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విడతల వారీగా, పక్కా ప్రణాళికతో ఒక్కో వయసు వారికి ఇస్తూ ముందుకు వెళ్లింది.
అక్టోబర్ 21నాటికి వంట టీకా డోసుల్ని పూర్తి చేసి చైనా తర్వాత శతకోటి డోసుల్ని పంపిణీ చేసిన రెండో దేశంగా ప్రపంచ దేశాల ప్రశంసల్ని అందుకుంది. ఇక దీనిపై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ స్పందిస్తూ.. భారత్ విజయవంతంగా 100డోసుల వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తి చేసుకుందని గుర్తు చేశాడు. భారత్ ఈ ఘనత సాధించడానికి పని చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వైద్య బృందాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చరణ్ ట్వీట్ చేశారు.
ఇక రామ్‌చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానుంది. అలాగే ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందించే చిత్రంలో రామ్‌చరణ్ నటించనున్నారు. ఇందులో చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ స్వరాలు అందిస్తున్నారు.