8వ‌ త‌ర‌గ‌తి పాప‌కు తెలుసు మ‌న‌కు తెలియ‌దు సిగ్గుండాలి: ఎన్టీఆర్‌

  388
  0
  ntr

  యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు లో హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు ఈ షో ఎంతో ఆస‌క్తిక‌రంగా సాగుతూ ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని క‌లిగిస్తుంది. అయితే అక్టోబ‌ర్ 19న ప్ర‌సారం అయినా ఎపిసోడ్‌లో రాజ‌మండ్రికి చెందిన సురేంద్ర‌నాథ్‌, ఎన్టీఆర్‌ల సంభాష‌ణ ఎలా జ‌రిగిందో తెలుసుకుందాం. సురేంద్ర‌నాథ్ వెంట తండ్రి వెంగ‌య్య, కూతురు హ‌ర్షిణి ఈ షోలో పాల్గొన్నారు. విజ్ఞాన్ స్కూల్‌లో హ‌ర్షిణి ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుకొంటుంది. అదే స్కూల్‌లో ఎన్టీఆర్ కూడా చ‌దువుకున్నారు. అదే విషయాన్ని హ‌ర్షిణి గుర్తు చేశారు.

  మా స్కూల్‌లో చ‌దువుకున్న ప్ర‌ముఖుల ఫోటోలు పెట్టారు.. అందులో మీ ఫోటో కూడా ఉంది.. మీ అంద‌రి మాదిరిగానే మేము ఎద‌గాల‌ని స్పూర్తి పొందుతున్నాం అని హ‌ర్షిణి చెప్పారు. ఇక ఈ షోలో భాగంగా సురేంద్ర‌నాథ్‌కు బాల‌కృష్ణ న‌టించిన ఓ సినిమాలోని పాట‌ను వినిపించారు. ఈ పాట ఏ చిత్రంలోనిది అని అడిగితే క‌రెక్ట్‌గా చెప్పారు. ఈ క్ర‌మంలో దీనిపై ఎన్టీఆర్ చెబుతు.. ఈ సినిమా చూసిన త‌ర్వాత జోష్‌ను ఆపుకోలేక ముందు ఉన్న సీటును త‌న్నితే విరిగిపోయింది అంటూ ఎన్టీఆర్ త‌న అనుభూతుల‌ను పంచుకొన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ న‌టించిన స్టూడెంట్ నెంబ‌ర్‌1 గురించి సురేంద్ర‌నాథ్ మాట్లాడుతూ.. మీరు ఆ సినిమాలో డ్యాన్స్ బాగా చేశారు.

  నేను మీకు ఫ్యాన్ అని అంటే.. నేను బేసిక్‌గా కూచిపూడి డ్యాన్స‌ర్‌ను. మా గురువు సుధాక‌ర్ గారు నేర్పించారు. ఆయ‌న ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆయ‌న‌ను క‌లుసుకోవ‌డానికి వీలు కావ‌డం లేదు. ఎలాగైనా క‌లుసుకోవాలి. సుధాక‌ర్‌గారికి ఈ సంద‌ర్భంగా ప్రణామం అంటూ ఎన్టీఆర్ దండం పెట్టారు. అదేవిధంగా 1+41 క‌వితా సంపుటి గ‌బ్బిలం ర‌చ‌యిత ఎవ‌రు? అని అడిగితే.. ఆయ‌న లైఫ్‌లైన్ తీసుకొన్నారు. ఆ ప్ర‌శ్న‌కు సురేంద్ర‌నాథ్ కూతురు హ‌ర్షిణి స‌మాధానం చెప్ప‌డంతో ఎన్టీఆర్ ఆశ్చ‌ర్య‌పోయాడు. మీకు ఈ ప్ర‌శ్న‌కు సమాధానం ఎలా తెలుసు అంటే.. మా తెలుగు టీచ‌ర్ ర‌చ‌యిత‌లు, ప్ర‌ముఖుల గురించి బాగా చెబుతారు. ఎనిమిది త‌ర‌గ‌తిలో గుర్రం జాషువా గురించి పాఠం ఉంది. ఆమె చాలా డీటైల్‌గా చెబుతారు అన‌గానే ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

  మీకు గుర్రం జాషువా గురించి ముందే తెలుసు అన్న‌మాట‌.. మ‌న‌కు సిగ్గుండాలి? ఎంబీఏ ఫైనాన్స్ చ‌దువుకుని ఏ లాభం అని ఎన్టీఆర్ అన‌గానే సురేంద్ర‌నాథ్‌తో పాటు అంద‌రూ న‌వ్వుల్లో మునిగిపోయారు. గుర్రం జాషువా గురించి మీకు ఎలా గుర్తుంది అంటే.. మా రాజ్యలక్ష్మీ టీచర్ మాకు చాలా బాగా చెప్పారు. ఆమె చాలా చక్కగా వివరంగా చెబుతారు అని హర్షిణి చెబితే.. ఇంత బాగా చెప్పిన రాజ్యలక్ష్మికి ధన్యవాదాలు. ఇలాంటి స్కూల్స్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఎన్టీఆర్ చేతులెత్తి మొక్కారు. ఇలా ఎమోషనల్‌గా ఎపిసోడ్ ముగిసింది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here