“వీర‌మ‌ల్లు” చిత్ర విశేషాలు తెలిపిన హాట్ బ్యూటీ నిధి

  200
  0
  nidhi

  ప్ర‌ముఖ హీరోయిన్‌ నిధి అగ‌ర్వాల్ “ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్‌”తో హరిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ రూపొందిస్తుండ‌గా.. ప్ర‌ముఖ నిర్మాత ఏఎమ్‌ర‌త్నం నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈచిత్రానికి సంబంధించి ఫ‌స్ట్‌గ్లిమ్స్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌నే కాకుండా సినీ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్ష‌కులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు.

  ఇక ఈ చిత్ర విశేషాల‌ను నిధి అగ‌ర్వాల్ ఇటీవ‌లే పంచుకుంది. ఈ సినిమాలో తాను పంచ‌మి అనే యువ‌రాణి పాత్ర‌లో న‌టిస్తున్నాను. నా కెరీర్‌లో ఎంతో వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర ఇది.. శారీర‌కంగా నాకెంతో స‌వాల్‌గా నిలిచింది. పంచ‌మి రోల్ కోసం ఒంటిపై చాలా బ‌రువైన ఆభ‌ర‌ణాలు ధ‌రించాల్సి వ‌చ్చింది. వాటిని క్యారీ చేస్తూ షూట్‌లో పాల్గొన‌డం ఎంతో క‌ష్టంగా అనిపించేద‌ని.. షాట్ అయిపోగానే జాగ్ర‌త్త‌గా ఓ ద‌గ్గ‌ర కూర్చోవ‌డ‌మే త‌ప్ప విశ్రాంతి తీసుకోవ‌డానికి ఏ మాత్రం వీలుండేది కాద‌ని ఆమె తెలిపింది.

  అయితే ఈ క‌ష్టాన్ని ఎంతో విలువైన‌దిగా భావిస్తున్నాన‌ని, ఇలాంటి ఒక అద్భుత‌మైన సినిమాలో న‌టించ‌డం ఆనందంగా ఉంద‌ని నిధి అన్నారు. ఇక ఈచిత్రంలో బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ న‌టిస్తుండ‌గా.. మ‌రో కీల‌క‌పాత్ర‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చేస్తుంది. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణీ మ్యూజిక్ అందిస్తున్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here