మా అమ్మ చెప్పిన న‌మ్మ‌లేదు: స‌మంత‌

  255
  0
  sam ntr

  టాలీవుడ్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లే నాగ‌చైత‌న్య‌తో విడిపోతున్న‌ట్లు విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా మ‌రింత‌గా దూసుకెళ్తుంది. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తు శాకుంత‌లం ఇటీవ‌లే ఈ షూట్ కంప్లీట్ చేసుకుంది. మ‌రో రెండు కొత్త చిత్రాల‌కు ఓకే చేసింది స‌మంత‌.

  డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్న 30వ సినిమాలో స‌మంత న‌టించ‌బోతుంది. ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు శాంత‌రూబ‌న్ జ్ఞాన‌శేఖ‌ర‌న్ తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఇక ఇటీవ‌లే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మానికి స‌మంత విచ్చేసింది. ఈ సంద‌ర్భంగా స‌మంత 25ల‌క్ష‌ల రూపాయ‌ల ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పి.. తెగ ఆనంద‌ప‌డిపోయారు స‌మంత‌.. నేను జీనియ‌స్ మా అమ్మ ఎప్పుడూ నాకు చెప్పేది.

  కానీ నేను న‌మ్మేదాన్ని కాదు ఇప్పుడు న‌మ్ముతున్నా అని చెప్పుకొచ్చింది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ చెబుతూ.. నువ్వు నీ జీనియ‌స్ అని మీ అమ్మ‌గారు చూశారు. నేను నిరూపించా. నీకు స‌హాయం చేసినందుకు కృత‌జ్ఞ‌త‌గా నా కాళ్ల‌కు న‌మ‌స్కారం పెట్ట‌డం. నా ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజ‌లు చేయ‌డం చేయొద్దు అని ఎన్టీఆర్ చెప్ప‌డంతో షోలో న‌వ్వులు పూశాయి.. ఇలా ఈ షో అంతా స‌మంత సంద‌డి సంద‌డిగా చేసింది.

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here